మునుగోడు ఉపఎన్నిక: ముగిసిన నామినేష‌న్ల ఉప సంహ‌ర‌ణ గడువు.. చివరికి బరిలో మిగిలింది ఎందరంటే?

Munugode By-poll 47 Valid Nominations Remains in Contest by End of The Scrutiny Time, 47 Valid Nominations Remains In Munugode By-poll, Munugode Election Campaining, Mango News,Mango News Telugu, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. దీంతో.. మొత్తం ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలిచారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మునుగోడు ఉప ఎన్నికకు మొత్తం 130 మంది అభ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, వాటిలో వివిధ కారణాలతో 47 మంది నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, చివరకు 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులతో కీలక చర్చలు జరిపారు. దీంతో 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం పది మంది ఉపసంహరించుకోగా, నేడు మరో ముగ్గురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వీరందరూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించడం విశేషం. అయితే కూసుకుంట్లకు పోటీగా బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో నిలిచారు. అలాగే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్, బీఎస్పీ తరఫున ఒక అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + thirteen =