30 రోజుల ప్రణాళిక ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Errabelli Dayakar Latest News, Errabelli Dayakar Rao Starts 30 days Special Village Action, Errabelli Dayakar Rao Starts 30 days Special Village Action Plan, Errabelli Dayakar Rao Starts 30 days Special Village Action Plan In Warangal, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్దే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు వరంగల్ లో ప్రారంభించారు. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభం చేసి, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలను అభివృద్ధి పరచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో పని చేస్తున్నారని, ఈ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు నెరవేర్చాలని కోరారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, గ్రామసభలో స్థానికులందరూ కూర్చొని గ్రామానికి కావాల్సిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఊరు భవిష్యత్ గ్రామస్తుల చేతిలోనే ఉంటుందని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వాడుకొని ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి పాటు పడాలని కోరారు. శ్రమదానం, ఊరిలో పరిశుభ్రత వంటి అంశాలపై గ్రామస్తులకు సూచనలు చేసారు. ఇక్కడే కాకుండా వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తి గ్రామంలో, నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామాలలో నిర్వహించే గ్రామ సభల్లో కూడ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొనబోతున్నారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here