జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత

Former Zimbabwe President Robert Mugabe Dies, Former Zimbabwe President Robert Mugabe Dies At 95, international news 2019, International News Updates, latest international news headlines, Mango News Telugu, Robert Mugabe Dies At 95, Zimbabwe Ex President Robert Mugabe Dies At 95, Zimbabwe President Robert Mugabe Dies, Zimbabwe President Robert Mugabe Dies At 95

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఈ విషయాన్ని జింబాబ్వే దేశ అధ్యక్షుడు ఎమ్మర్సన్ మ్నంగగ్వా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ముగాబే వయస్సు 95 సంవత్సరాలు, ఆయన జింబాబ్వే దేశానికి సుదీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా పనిచేసారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాబర్ట్ ముగాబే సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని అధికార వర్గాలు నిర్ధారించాయి. 1980 ముందు జింబాబ్వే బ్రిటన్ కు వలస రాజ్యంగా ఉండేది, 1960 నుంచే రాబర్ట్ ముగాబే మైనారిటీ పాలనకు వ్యతిరేకముగా గెరిల్లా విముక్తి పోరాటాన్ని నడిపించారు.

జింబాబ్వే స్వాతంత్ర్యం పొందిన అనంతరం జరిగిన తోలి ఎన్నికల్లో విజయం సాధించిన ముగాబే ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత 1987 నుంచి దేశ అధ్యక్ష పగ్గాలు స్వీకరించారు. దేశ అధ్యక్ష హోదాలో 2017 వరకు కొనసాగారు, 2017 నవంబర్ లో సైనిక తిరుగుబాటు వలన ముగాబే మూడు దశాబ్దాల సుదీర్ఘమైన పాలనకు తెరపడింది. జింబాబ్వే దేశ అధ్యక్షుడు ఎమ్మర్సన్ మ్నంగగ్వా ట్విట్టర్లో స్పందిస్తూ రాబర్ట్ ముగాబే మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. జింబాబ్వే ప్రజల విముక్తి మరియు సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. దేశం మరియు ఖండం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరచిపోలేము అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here