జీహెచ్‌ఎంసీలో ఎన్నికల ప్రచారం: కాంగ్రెస్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే …

BJP Parties Star Campaigners List, Campaigning For GHMC Elections, Congress Parties Star Campaigners List, GHMC Election Campaign, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Campaigning, GHMC Elections Latest News, GHMC Elections Updates, GHMC Nominations, Greater Hyderabad Municipal Corporation, Mango News, Telangana Bhavan

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నామినేషన్స్ పక్రియ ముగియడంతో హైదరాబాద్ నగరంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ రోజు నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పెద్ద స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే 10 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా:

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి
  • బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
  • పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
  • జాతీయ ఓబీసీ మోర్చా అధ్య క్షుడు కె.లక్ష్మణ్
  • ఎంపీ ధర్మపురి అరవింద్
  • పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు
  • మాజీ ఎంపీ వివేక్
  • మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు
  • ఎమ్మెల్యే టి.రాజాసింగ్
  • ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా:

  • టిపీపీసీ ప్రెసిడెంట్, ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
  • వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి
  • వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్
  • మహ్మద్ అజహరుద్దీన్
  • జెట్టి కుసుమకుమార్
  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • సీనియర్ నేత వి.హన్మంతరావు
  • మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ
  • మాజీ ఎంపీ ఎం.అంజనకుమార్ యాదవ్

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 8 =