త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగుతుంది

AIADMK Alliance with BJP will Continue in Assembly Elections, Tamil Nadu Deputy CM Panneerselvam,Tamil Nadu Deputy CM ,Panneerselvam,AIADMK Alliance with BJP,AIADMK Alliance with BJP will Continue,AIADMK ,Tamil Nadu Assembly Elections,Tamil Nadu Politics,Mango News Telugu,Tamil Nadu

బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం నాడు తమిళనాడులోని చెన్నై నగరంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై అన్నాడీఎంకే నేత, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీతో అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతుందని పన్నీర్ సెల్వం వెల్లడించారు. 10 సంవత్సరాలగా రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాం. 2021లో కూడా అన్నాడీఎంకే-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ఎల్లప్పుడూ సహకరిస్తుందని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు.

మరోవైపు అమిత్ షా కూడా చెన్నైలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తమిళనాడు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రాల్లో కరోనాను నివారణకు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అభినందించారు. కేంద్ర పథకాల అమలు, రాష్ట్రంలో ప్రత్యేక పథకాలతో తమిళనాడు మంచి పరిపాలనతో ముందుకెళ్తుందని అమిత్ షా పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + three =