త్వరలోనే రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తాం – గవర్నర్‌ తమిళిసై

Governor Tamilisai Announces That will Be hold Grievance Cell For Public in Raj Bhavan From Next Month, Telangana Governor Tamilisai Announces That will Be hold Grievance Cell For Public in Raj Bhavan From Next Month, Governor Tamilisai Announces That will Be hold Grievance Cell For Public in Raj Bhavan, Telangana Governor Tamilisai Soundararajan, Governor Tamilisai Soundararajan, Telangana Governor Tamilisai, Grievance Cell For Public in Raj Bhavan From Next Month, Grievance Cell For Public in Raj Bhavan, Grievance Cell For Public, Raj Bhavan, Raj Bhavan Latest News, Raj Bhavan Latest Updates, Raj Bhavan Live Updates, Telangana Raj Bhavan, Public Grievance Cell, Grievance Cell, Governor Tamilisai, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రజానీకం కోసం త్వరలోనే రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని గవర్నర్‌ తమిళిసై వెల్లడించారు. ఇంతకుముందు ప్రజాదర్బార్‌ నిర్వహించామని.. తద్వారా పేద ప్రజల సమస్యలు కొన్నింటిని పరిష్కరించగలిగామని తమిళిసై పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి ఆటంకం కలిగిందని.. వచ్చేనెల నుంచి మళ్ళీ నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తమిళిసై తెలిపారు. తెలంగాణ ప్రజలకు మేలు చేయటం కోసమే రాజ్‌భవన్‌ ఉందని.. అందుకే వారి సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తుల విభాగం ఏర్పాటు చేశామని తమిళిసై అన్నారు. ప్రజాదర్బార్‌ ముందుకు వచ్చిన ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా సూచిస్తామని చెప్పారు.

తనకు ఎలాంటి ఇగో లేదని, అందరితో సఖ్యతగా ఉండటమే తనకు తెలుసన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. నిన్న రాజ్‌భవన్‌లో ఉగాది పర్వదినం సందర్భంగా వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్​రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలలో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపించారని, అయితే ఆయన హాజరు కాలేదని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 17 =