వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై

Governor Tamilisai Soundararajan Expressed Concern over the Way of Arrest of YSRTP President YS Sharmila,Governor Tamilisai Soundararajan,YSRTP chief YS Sharmila arrested,YS Sharmila arrested in Pragati Bhavan,YS Sharmila Pragati Bhavan,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల అరెస్ట్‌ పరిణామాలు, అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారు లోపల ఉన్నప్పుడు, ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయని అన్నారు. అరెస్టు చేసిన తీరుపై గవర్నర్ స్పందిస్తూ, ఆమె భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేపథ్యం లేదా భావజాలం ఏదైనా కావచ్చని మహిళా నాయకురాలను మరింత గౌరవప్రదంగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో మహిళా కార్యకర్తలు మరియు మహిళా నాయకురాలను మరింత గౌరవప్రదంగా చూడాల్సి ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.

మరోవైపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు ఆమెకు వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ముందుగా మంగళవారం ప్రగతిభవన్‌ ముట్టడికి వైఎస్ షర్మిల తన కారులో వెళ్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకుని, శాంతిభద్రతల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెపై పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌ నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైఎస్ షర్మిలను మంగళవారం రాత్రి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. దాదాపు రెండు గంటల పాటుగా పోలీసుల తరఫు న్యాయవాది, వైఎస్ షర్మిల తరఫు న్యాయవాదులు వాదనలు విన్న న్యాయమూర్తి, వైఎస్ షర్మిలతో పాటుగా మరో ఆరుగురు పార్టీ నేతలకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేస్తునట్టు ప్రకటించారు. బెయిల్ మంజూరు అనంతరం ఆమె లోటస్ పాండ్ లోని తన నివాసానికి చేరుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here