వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్ జరీన్‌ను స‌త్కరించిన తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్

Telangana CS Shanti Kumari and DGP Anjani Kumar Congratulates Women's World Boxing Champion Nikhat Zareen,Telangana CS Shanti Kumari,CS Shanti Kumari Congratulates Women's World Boxing,DGP Anjani Kumar Congratulates Women's World Boxing,Women's World Boxing Champion Nikhat Zareen,Mango News,Mango News Telugu,Telangana CS Shanti Kumari Latest News,DGP Anjani Kumar News Today,Womens World Boxing,Womens World Boxing 2023,Womens World Boxing Latest News,Womens World Boxing Live Updates

తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్‌, గత కొన్నిరోజుల క్రితం జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నిఖత్ జరీన్‌ బీఆర్‌కే భ‌వ‌న్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి మరియు డీజీపీ అంజనీ కుమార్ లను మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎస్, డీజీపీ నిఖత్ జరీన్‌ను అభినందించారు. సీఎస్ శాంతి కుమారి జ‌రీన్‌ను శాలువాతో స‌త్క‌రించగా.. డీజీపీ అంజనీ కుమార్ పుష్పగుచ్చం అందించారు. ఇక నిఖ‌త్ జరీన్‌ తెలంగాణ ఖ్యాతిని ప్ర‌పంచ ప‌టంలో నిలిపింద‌ని సీఎస్ ప్ర‌శంసించారు. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న రెండవ భారతీయ బాక్సర్‌గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించిందని, అలాగే ఈ విజయాలతో యువ క్రీడాకారులకు నిఖ‌త్ జరీన్ ఆదర్శవంతంగా నిలిచిందని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్‌సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =