తెలంగాణ ఆదర్శరాష్ట్రంగా నిలిచింది

Governor Tamilisai Soundararajan First Speech, Governor Tamilisai Soundararajan First Speech About Telangana, Governor Tamilisai Soundararajan First Speech About Telangana State, Mango News Telugu, Political Updates 2019, Tamilisai Soundararajan First Speech About Telangana, Tamilisai Soundararajan First Speech About Telangana State, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ కొత్త గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజనుద్దేశించి ప్రసంగించి సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాల్లో తాను కూడ భాగస్వామిగా మారడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశం గర్వించదగిన ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు ఏర్పాటు చేసుకుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి మనోభావాలకు గౌరవం ఇస్తూ, అన్ని మతాలకు చెందిన పండుగలకు ప్రభుత్వం సమాన హోదా ఇచ్చిందని, గంగా జమునా తెహ్జీబ్‌ను ప్రభుత్వం నిబద్ధతతో పరిరక్షిస్తుందని తెలిపారు. 2018-19లో తెలంగాణ 14.84% జిఎస్‌డిపిని సాధించిందని, రాష్ట్ర సంపద 2014 లో రూ.4 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడు రూ.8.66 లక్షల కోట్లకు పెరిగింది. ప్రభుత్వం మంచి సంక్షేమ పధకాలను ప్రజల ఇంటికి చేరుస్తూందని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పరిపాలనలో బెంచ్‌మార్క్‌గా మారనుంది. పరిశుభ్రత, హరిత హరం, విద్యుత్ ఉత్పత్తి, రైతు బంధు మరియు రైతు భీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథా వంటి కార్యక్రమాలతో ప్రజలకు సేవలందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. మానవ నిర్మిత అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు, రికార్డ్ సమయంలో పూర్తి చేయడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో పాటు, సముద్రంలో వృధాగా కలిసే 575 టీఎంసీల నీటిని వ్యవసాయ పొలాలకు తరలించడం, త్రాగు నీరు, విద్యుత్ ఉత్పత్తికి కూడ ఉపయోగపడుతుందని చెప్పారు. ఐటీ రంగంలో ప్రభుత్వం రూ.1.10 లక్షల కోట్ల ఎగుమతులను సాధించిందని చెప్పారు. మెట్రో, లా అండ్ ఆర్డర్ ఉన్న గ్లోబల్ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి దేశంలోని మిగిలిన నగరాలకు కొత్త ప్రమాణాలను నిర్ణయించిందని అన్నారు. అన్ని రాజకీయ మరియు సామాజిక భేదాలను పక్కనపెట్టి, బలమైన దేశాన్ని ప్రోత్సహించడానికి బలమైన రాష్ట్రాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here