పేషంట్ ఆరోగ్య శ్రీ కింద చేరితే ఇంటికి వెళ్ళేంత వరకు పూర్తి ఉచితంగా చికిత్స : మంత్రి ఈటల

Aarogyasri Scheme, Aarogyasri Scheme Latest News, Aarogyasri Scheme News, Aarogyasri Scheme Updates, Eatala Rajender, Eatala Rajender Reviewed on Aarogyasri Scheme, Health Minister Eatala Rajender, Telangana Aarogyasri Scheme, Telangana Health Minister Eatala Rajender

ఆరోగ్య శ్రీ, ఉద్యోగ-జర్నలిస్ట్ ల హెల్త్ స్కీమ్ పై బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం వంద రెట్లు మెరుగైనదని అన్నారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడానికి, లీకేజీలు అరికట్టదానికి కమిటీ వేసి నివేదిక అందించాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. “గుడిసెలో ఉండేవారికి అయినా, బంగ్లాలో ఉండే వారికి అయినా వైద్యానికి పెట్టే ఖర్చు ఒకటేనని, అనేక పేద కుటుంబాలు వైద్యంకి ఖర్చు పెట్టలేక నలిగి పోతున్నాయి. అలాంటి పేదవాడికి అండగా ఉండాలి. ఆత్మహత్యలకు కారణాల్లో అనుకోకుండా మీద పడే వైద్య ఖర్చులు కూడా ఒకటి అని జయతీ ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ బాధలను దూరం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది” అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స అందించడానికి నిరాకరిస్తే చర్యలు:

వైద్యంకి డబ్బులు ఖర్చు కాకుండా ఉండాలంటే ప్రభుత్వ వైద్యంను మెరుగుపరచడం ఒక్కటే మార్గం. ఆరోగ్య శ్రీ లాంటి సేవలు మెరుగుపరచడం ద్వారా పేదవాడి జేబు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా చూస్తాం. పాత పద్దతులను పక్కన పెట్టి ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా విధివిధానాలు తయారు చేయాలని అధికారులని మంత్రి ఆదేశించారు. పురోగమన పద్దతిలో, ప్రజాధారిత కోణంలో సంస్కరణలు తీసుకురావడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు. లీకేజీలపై దృష్టి పెట్టాలని సూచించారు. చీట్ చేసే హాస్పిటళ్ల మీద ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రజాధనం వృధా కాకుండా చూడాలని కోరారు. వివిధ జబ్బులకు చెల్లిస్తున్న డబ్బులు, చికిత్స విధానాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా క్రమబద్దీకరణ చేయాలని కోరారు. ఆరోగ్య శ్రీ జాబితాలో ఉన్న ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స అందించడానికి నిరాకరిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. అటువంటి ఆసుపత్రులమీద ఫిర్యాదు చేయడానికి 104 కి ఫోన్ చేయాలని ప్రజలకు మంత్రి సూచించారు. ఆరోగ్య శ్రీ వార్డ్ అంటూ విభజన చేయకుండా అందరు పేషంట్లతో పాటుగా చికిత్స అందిచేలా చూడాలని అధికారులను కోరారు. ఆరోగ్య శ్రీ హాస్పిటల్ జాబితాలో చేరడానికి అప్లై చేసుకున్న ప్రైవేట్ హాస్పిటల్ కి అనుమతి ఇవ్వాలని ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే నాణ్యతా నిబంధనలు అన్నీ పరిశీలించిన తరువాతనే అనుమతి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.

పేషంట్ ఆరోగ్య శ్రీ కింద చేరితే ఇంటికి వెళ్ళేంత వరకు పూర్తి ఉచితంగా చికిత్స:

ఒక పేషంట్ ఆరోగ్య శ్రీ కింద చేరితే ఇంటికి వెళ్ళేంత వరకు పూర్తి ఉచితంగా చికిత్స అందించాలే తప్ప మంచి పరికరాలు వేస్తామని, మంచి రూమ్ ఇస్తామని కారణాలు చెప్పి హాస్పిటల్స్ డబ్బులు వసూలు చేయకుండా చూడాలని మంత్రి సూచించారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి విజిలెన్స్ టీం లు ఏర్పాటు చేయాలని సూచించారు. చికిత్స పొందిన వారి ఫీడ్ బ్యాక్ తీసుకొని అవసరం అయితే హాస్పిటల్ ని ఆరోగ్య శ్రీ జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఆరోగ్య శ్రీ లో పని చేస్తున్న సిబ్బంది సంఖ్య పెంచాలని కూడా మంత్రి ఆదేశించారు. చికిత్సకి అనుమతి ఇవ్వడానికి అవసరం అయిన ప్యానల్ డాక్టర్ల సంఖ్య పెంచడానికి అనుమతి ఇచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్ లో పేషంట్ల సహాయం కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్యమిత్ర ల పనితీరుపై కూడా మంత్రి సమీక్షించారు. పని భారంకి అనుగుణంగా వారి సంఖ్యను క్రమబద్దీకరణ చేయాలని సూచించారు. ఒక మిత్ర ఒక హాస్పిటల్ లో ఒక సంవత్సర కాలం పాటు పనిచేసేలా చూడాలని కోరారు. వారికి ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు.

ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ పథకం 100 రెట్లు మెరుగు:

పేదలకు నాణ్యమైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించడం ఆరోగ్య శ్రీ లక్ష్యం. ఆ తృప్తి ప్రజలకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆరోగ్య ట్రస్ట్ అధికారులతో జరిగిన సుధీర్గ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కూడా కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్ది ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళే అవసరం లేకుండా చేస్తామన్నారు. గతంలో ఆరోగ్య శ్రీ బకాయిలు వేల కోట్లలో ఉండేవని కానే ఇప్పుడు కేవలం 199 కోట్లు మాత్రమే ఉన్నాయని వాటిని కూడా అతి త్వరలో చెల్లిస్తామని తెలిపారు. ఉద్యోగులు, జర్నలిస్ట్ ల హెల్త్ కార్డ్స్ ఉన్నవారికి అన్ని ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య శ్రీ పథకం 100 రెట్లు మెరుగైనదని అన్నారు. దానిలో లేని 517 చికిత్సా విధానాలు ఆరోగ్య శ్రీ లో ఉన్నాయని, అందులో 434 చికిత్సలు అతి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య ట్రస్ట్ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =