తెలంగాణకు ఐజీఎస్టీ కింద రావాల్సిన 2638 కోట్లు వెంటనే విడుదల చేయాలి: మంత్రి హరీశ్

Conference of Group of Ministers on IGST, Harish Rao, Harish Rao Conference of Group of Ministers, Harish Rao On IGST, Harish Rao Participated in Conference of Group of Ministers on IGST, Harish seeks release of IGST dues, IGST council meeting, Minister Harish Rao, Minister Harish Rao Participates in IGST Group, Telangana demands immediate release of Rs 2638 cr IGST, Telangana Finance Minister T Harish Rao

ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం బుధవారం నాడు జరిగింది. ఐజీఎస్టీ‌ కమిటీలో సభ్యుడైన తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ లో సభ్యులైన ఢిల్లీ, చత్తీస్ ఘడ్, పంజాబ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీ మొత్తంపై ఎలాంటి అభ్యంతరాలు లేవని, రాష్ట్రానికి ఎంత ఐజీఎస్టీ రావాల్సి ఉందన్న విషయంపై స్పష్టత ఉందని చెప్పారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 25 వేల 58 కోట్లు ఐజీఎస్టీ మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ జీఎస్టీ కౌన్సిల్ కు సిఫారసు చేయాలని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఐజీఎస్టీ కింద రావాల్సిన రూ.2638 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.

గతంలో ఈ మొత్తాన్ని 25 వేల 58 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ లో నిబంధలకు విరుద్ధంగా జమ చేశారన్న విషయాన్ని పార్లమెంట్ లో కాగ్ ఎత్తి చూపిన విషయాన్ని ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు ప్రస్తావించారు. కాగ్ సైతం ఈ విషయంలో తప్పు పట్టింది కాబట్టి ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని ఇవ్వాలన్న సిఫారసును గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అక్టోబర్ 5 వ తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ ఎజెండాలో ఉండేలా చూడాలని కోరారు. అందుకు ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కన్వీనర్, బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోడీ అంగీకారం తెలుపుతూ , రాష్ట్రాలకు ఐజీఎస్టీ మొత్తం ఇవ్వాలన్న సిఫారసును ఈ రోజే తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.

2017-2018లో, తిరిగి 2018-2019లో ఇదే తప్పు జరిగిందన్న విషయాన్ని కాగ్ మొన్న పార్లమెంట్ లో బహిర్గతం చేసిందని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ప్రస్తావించారు. 2018-19లో 13 వేల 944 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కేంద్రం మళ్లీ కన్సాలిడేటెడ్ ఫండ్ లో జమ చేయడాన్ని కాగ్ మరో మారు తప్పు పట్టిందన్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఆయన తెలంగాణకు ఇందులో 210 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ఐజీఎస్టీలో సెటిల్మెంట్ బేస్డ్ ఆన్ ఆన్వల్ రిటర్న్స్ కింద రాష్ట్రానికి మరో 1000 కోట్లు రావాల్సి ఉందని, జీఎస్టీ కౌన్సిల్ ఈ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు కోరారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here