నాలుగు రోజుల్లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం – మంత్రి ఈటల రాజేందర్

Etala Rajender, Health Minister Etala Rajender, telangana, telangana institute of medical sciences, tims gachibowli, TIMS Hospital, tims hospital hyderabad, TIMS Hospital Will Start in 4 days, TIMS ready to treat COVID patients, tims telangana

నాలుగు రోజుల్లో గచ్చిబౌలి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఐపి సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. 1224 బెడ్స్ అందులో 1000 బెడ్స్ కి ఆక్సిజన్ కనెక్షన్, 50 బెడ్స్ కి వెంటిలేటర్ లతో, అత్యంత అధునాతన సౌకర్యాలతో టిమ్స్ ఆసుపత్రి సిద్ధం అయ్యిందని చెప్పారు. చండీగఢ్ పీజీ కాలేజీ ఎలా గొప్ప డాక్టర్స్ ను తయారు చేసి బయటికి పంపిస్తుందో అదే తరహాలో టిమ్స్ పీజీ కాలేజీ కూడా డాక్టర్స్ ను అందించబోతుందని మంత్రి తెలిపారు. సూపర్ స్పెషాలిటీ కోర్సులకు టిమ్స్ కేరాఫ్ అడ్రెస్స్ కావాలని అనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి ఈటల అన్నారు.

కార్పొరేట్ ఆసుపత్రులలో లేనన్ని హంగులు ఇక్కడ ఉన్నాయి. ఇంత అత్యాధునికమైన ప్రభుత్వ ఆసుపత్రి ఇంకా ఎక్కడా లేదు అని గర్వంగా ప్రకటిస్తున్నామని మంత్రి అన్నారు. టిమ్స్ లో 1224 బెడ్స్ సామర్ధ్యం ఉండగా, 1000 బెడ్స్ కి ఆక్సిజన్ కనెక్షన్లు, 50 బెడ్స్ కి వెంటిలేటర్ అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ బిల్డింగ్ లో 15 ఫ్లోర్ సిద్ధం అయ్యాయని ఇందులో సెల్లార్ లో క్యాంటీన్, స్టోర్స్, గ్రౌండ్ ఫ్లోర్ లో అడ్మినిస్ట్రటివ్ ఆఫీస్ లు, ల్యాబ్, మిగిలిన 13 ఫ్లోర్లలో పేషంట్ల బెడ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడ ఉన్న పేషంట్లకు ఇక్కడే బోజనము చేసి అందిస్తామని తెలిపారు. మరో రెండు రోజుల్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తి అవుతుందని, అది అవ్వగానే టిమ్స్ లో ఐపి సేవలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం అత్యంత తక్కువ సమయంలో హెల్త్ రంగంలో పురోగతి సాధించాం. కేరళ, తమిళ నాడు తరువాత ఆరోగ్య రంగంలో దూసుకుపోతున్నామని అతి త్వరలో దేశంలో మొదటిస్థానం సాధిస్తామని మంత్రి అన్నారు. ఆరోగ్య రంగంలో అనేక రిఫార్మ్స్ తెచ్చాం అని అన్నారు. గాంధీ ఆసుపత్రి వేలాది మందికి వైద్యం అందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తుంది. పేదల ప్రాణాలు కాపాడుతున్న హాస్పిటల్ గాంధీ. అక్కడ పని చేస్తున్న డాక్టర్స్, సిబ్బంది మనో స్థైర్యం దెబ్బతీయవద్దు, బురద చల్లడం మానాలని ప్రతిపక్ష నేతలను కోరారు. సోషియల్ మీడియా లో కామెంట్లు పేషెంట్లకు నష్టం చేస్తాయి అన్నారు. జిమ్మేదారీ లేని వాళ్ళు, భాద్యత లేని వాళ్ళు అనేక దుస్పచారాలు చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిందెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వాటిని నమ్మకండి అని విజ్ఞప్తి చేశారు.

కరోనా పేషెంట్లకు తోడుగా హాస్పిటల్ లో ఎవరూ ఉండరు. అన్నీ తామై వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వారిని అవమాన పరచడం తగదని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోండి, హాస్పిటల్ లో చేరండి. ఎంత మందికి అయిన చికిత్స చేయడానికి బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చెరవద్దని ప్రజలను కోరారు. పక్కన ఇంటిలో కరోనా పాజిటివ్ ఉంటే ఎం భయపడకండి. అది మీకు సొకదు. బాధ్యత లేని వాళ్ళు కన్ఫ్యూజన్ చేస్తున్నారు. పట్టించుకోవద్దని మంత్రి కోరారు. మీడియా కూడా ప్రజలకు ధైర్యం కలిగించాలని విజ్ఞప్తి చేశారు.

పరీక్షల విషయంలో అనవసర రాద్ధాంతం చేయవద్దని, ప్రస్తుతం 6600 పరీక్షల కెపాసిటీ కి చేరుకున్నాం. ప్రైవేట్ తో కలిపి 10 వేల పరీక్షలు ప్రతి రోజూ చేసే సామర్థ్యం మనకుంది అన్నారు. కేంద్రం మనకు వచ్చిన మిషన్ వేరే రాష్ట్రం కు తరలించకుండా ఉంటే రోజుకు 15 వేల పరీక్షలు చేయగలిగి ఉండే వాళ్ళం అన్నారు. కరోనా మరణాల డెత్ రేట్ తగ్గుతూ వస్తుంది. కరోనా కూడా తగ్గాలని కోరుకుంటున్నానని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స కోసం వచ్చిన వయసు మళ్ళిన వాళ్ళను వారి పిల్లలు ఇంటికి తీసుకుపోవడనికి ముందుకు రావడం లేదని ఇదేనా మానవత్వం అని మంత్రి ప్రశ్నించారు. అలాగే అపార్ట్మెంట్ లో ఒక ఇంటికి వారికి కరోనా సోకితే మిగిలిన వారు అండగా ఉంటారా? లేక వెలి వేస్తారా? అని ప్రశ్నించారు. సమాజ ధర్మాన్ని మర్చిపోవద్దు అని గుర్తు చేశారు. ఈ రోజు టిమ్స్ పరిశీలనలో మంత్రి ఈటల రాజేందర్ పాటు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్ నాగేందర్, ప్రొఫెసర్ విమలా థామస్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here