తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త, విద్యుత్ శాఖలో పోస్టుల భర్తీ

Mango News, Telangana Breaking News Today, Telangana TSSPDCL Recruitment 2019, TSSPDCL Jobs 2019, TSSPDCL Recruitment 2019, TSSPDCL Recruitment Notification, TSSPDCL Recruitment Notification 2019, TSSPDCL Recruitment Notification For Various Posts

తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, నిరుద్యోగ సమస్య పై మరింత దృష్టి సారించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ప్రకటించారు. అందులో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించి ఖాళీలను గుర్తించి, వాటి నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ రోజు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) లో 2,939 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నియామక పక్రియ ద్వారా 2,438 జూనియర్‌ లైన్‌మెన్, 477 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు, 24 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. వివరాలను https://www.tssouthernpower.com లేదా https://tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్లలో పొందపర్చనున్నారు. పోస్టుల వారీగా రిజర్వేషన్ వివరాలు, విద్యా అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఫీజు చెల్లింపు ఆఖరు తేదీ, పరీక్ష తేదీల వివరాలు మొదలైనవి త్వరలో వచ్చే ప్రకటనలో వెల్లడించనున్నారు. పెద్ద సంఖ్యలో లైన్‌మెన్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు ఉండడంతో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చే అవకాశం ఉంది.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here