తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లులోని ముఖ్యాంశాలు

Highlights of the Revenue Bill, New Revenue Act, New Revenue Act Bill, New Revenue Act Bill in Telangana Assembly, Revenue Act Bill, Revenue Bill, Revenue Bill introduced by the Government of Telangana, Telangana Assembly, Telangana Assembly 3rd Day, Telangana Revenue Bill

ఈ రోజు తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టిన బిల్లుల్లో భూమిపై హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం-2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం-2020 ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవు అని ప్రభుత్వం తెలిపింది. ‘‘భూలావాదేవీలకు వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ కోసం దరఖాస్తు చేయాలి. సబ్‌రిజిస్ట్రార్‌ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలి. భూములను మార్ట్‌గేజ్ చేస్తే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్‌ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. భూమి హక్కుపత్రం, పట్టాదారు పాస్‌పుస్తకం ఏకీకృతం చేస్తాం. భూహక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ఉంటాయి. ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా భూయాజమాన్య హక్కుల బదిలీ ఉంటుంది’’ అని ప్రభుత్వం వివరించింది.

రెవెన్యూ బిల్లులోని ముఖ్యాంశాలు:

  • నిబంధనలకు విరుధ్దంగా భూమి హక్కుల రికార్డుల అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రిమినల్ చర్యలతోపాటు సర్వీసు నుంచి తొలగింపు, భర్తరఫ్, శిక్ష.
  • రైతులకు పట్టాదారు పాసుపుస్తకం ప్రతి లేకుండా ఎలక్ట్రానిక్ విధానంలో రుణాలు.
  • గ్రామ రెవెన్యూ అధికారుల పదవులు రద్దు.
  • ధరణి పోర్టల్లో ఆన్ లైన్ ద్వారా భూ యాజమాన్య హక్కుల బదిలీ.
  • పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో భూ రికార్డ్స్ నిర్వహణ.
  • వీఆర్వోగా పనిచేస్తున్న వారి సేవలను పరిపాలన అవసరాలను బట్టి అదే స్థాయిలో ఇతర ప్రభుత్వ శాఖలోకి బదిలీ.
  • కొత్త చట్టం వ్యవసాయయోగ్యమైన భూమి కోసం మాత్రమే వర్తిస్తుంది.
  • పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రముగా పరిగణన.
  • తహశీల్దార్ కు సబ్ రిజిస్ట్రార్ కు ఉండే అధికారాలు అప్పగింత.
  • భూ వివాదాల పరిష్కారాల కోసం ఒక్కరు లేదా అంతకన్నా ఎక్కువ సభ్యులతో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు.
  • కోర్ బ్యాంకింగ్ సిస్టం-ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజ్ చేయాలి.
  • కొత్త పట్టాదారు పుస్తకానికి హక్కుల రికార్డుగా పరిగణిస్తారు.
  • ఆ రికార్డులో పట్టాదారు పేర్లు-సర్వే నంబర్లు-విస్తీర్ణం ఉంటాయి.
  • ఈ చట్టం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు.
  • పాయిగా-జాగీరు-సంస్థానాలు-మక్తా-గ్రామ అగ్రహారం-ఉహ్మ్లి-ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు.
  • జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి.
  • ఏ రకమైన రిజిస్టేషన్ కోసమైనా ప్రభుత్వం నిర్దేశించిన వెబ్ సైట్స్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి.
  • రిజిస్టేషన్ సమయంలో పాస్ పుస్తకం బదిలీ దస్తావేదులు రిజిస్ట్రార్ సమక్షంలో ఇవ్వాలి.
    మ్యుటేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి.
  • వ్యవసాయ భూముల అమ్మకం కొనుగోలు, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే హక్కుల రికార్డ్ పూర్తి చేసి కొన్నవారికి వెంటనే బదిలీ చేయాలి.
  • ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి.
  • మోసపూరితంగా ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేస్తే రద్దు చేసి అధికారం కలెక్టర్ కు అప్పగింత.
  • జారీ చేసిన చేసిన తహశీల్దార్ పై బర్తరఫ్ క్రిమినల్ కేసులు-తిరిగి భూములు స్వాధీనం.
  • కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం-ప్రభుత్వ అధికారిపై ఎటువంటి దావా వెయ్యరాదు.
  • ఇప్పటి వరకు ఎటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయని భూములకు పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం తహశీల్దార్ కు ఉంది.
  • డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలి.
  • రుణాల మంజూరు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు.
  • ఈ చట్టం సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద విచారణకు అర్హత ఉంది.
  • ఈ బిల్లు చట్టరూపం దాల్చగానే పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 రద్దు అవుతుంది.
  • రికార్డులను అక్రమంగా దిద్దడం-మోసపూరిత ఉత్తర్వులు జారీ చేస్తే అధికారులు, ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు, సర్వీస్ నుంచి తొలగించి బర్తరఫ్ చేస్తారు.
  • 1971 యాక్ట్ రద్దు అయిన నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ కేసులన్ని కొత్తగా ఏర్పాటు చేసే ప్రత్యేక ట్రిబ్యునల్ కు బదిలీ. విచారణ తరువాత ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఫైనల్. కొత్త చట్టం ఏర్పాటయిన తరువాత రూల్స్ రూపొందించాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 7 =