సెప్టెంబర్ 17వ తేదీని జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలి – ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

Hyderabad AIMIM Chief Asaduddin Owaisi Demands For Sep 17th Should be Celebrated as National Integration Day, Telangana National Integration Vajrotsavam Events on September 16-18, Mango News, Mango News Telugu, Telangana National Integration Day, National Integration Day on Sept 17, Telangana National Integration Day on Sept 17, AIMIM Chief Asaduddin Owaisi, Telangana Latest News And Updates, KCR News And Live Updates, AIMIM, Asaduddin Owaisi

కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని నిర్ణయించడంపై ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం పేరుతో కాదని ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ పేరుతో జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అసదుద్దీన్ ఒవైసీ.. శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులకు లేఖ రాశారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన దీనిపై మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజని, హైదరాబాద్ విమోచన కోసం హిందువులతోపాటు అనేకమంది ముస్లిములు కూడా పోరాడారని గుర్తు చేశారు. దీనిని పురస్కరించుకుని ఆ రోజున పాతబస్తీలో ‘తిరంగా యాత్ర’ నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =