హైదరాబాద్‌లో వెలుగు చూసిన కొత్త వేరియంట్ BA.4 ఒమిక్రాన్.. దేశంలో ఇదే తొలి కేసు

Hyderabad India Reports First Case of New BA.4 Omicron Variant, Hyderabad Reports First Case of New BA.4 Omicron Variant, First Case of New BA.4 Omicron Variant, New BA.4 Omicron Variant, India, India Covid-19, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, India Coronavirus, India Coronavirus Cases, India Coronavirus Deaths, India Coronavirus New Cases, India Coronavirus News, India New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, Covid-19 Updates in India, India corona State wise cases, India coronavirus cases State wise, Mango News, Mango News Telugu,

ప్రపంచదేశాలను ఒణికిస్తున్న కరోనా రోజు రోజుకూ కొత్తగా రూపాంతరం చెందుతోంది. అనేక జన్యు ఉత్పరివర్తనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కోవలోనే తాజాగా ఈ వైరస్ కొత్త వేరియంట్ BA.4 ఒమిక్రాన్ మన హైదరాబాద్ నగరంలో వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. మే 9న సేకరించిన హైదరాబాద్‌లోని కోవిడ్-19 పాజిటివ్ రోగి నమూనా నుండి BA.4 ఒమిక్రాన్ వేరియంట్‌ను జన్యు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాగా ఇండియన్ జెనోమిక్స్ కన్సార్టియం వద్ద అందుబాటులో ఉన్న ఇటీవలి డేటా ప్రకారం, దేశంలో ఈ వేరియంట్ కేసు ఇదే మొదటిదని ప్రకటించింది. భారతీయ కోవిడ్-19 పాజిటివ్ రోగులలో కొత్త వైవిధ్యాలను గుర్తించడానికి ఈ జెనోమిక్స్ కన్సార్టియం పని చేస్తోంది.

ఇప్పుడు దేశంలో వెలుగు చూసిన BA4 తో పాటు BA5 అనే వేరియంట్‌ కూడా దక్షిణాఫ్రికాలో మొదలైన ఐదవ కోవిడ్ వేవ్‌లో గుర్తించబడ్డాయి. పరిశోధనా సంస్థల నుండి వచ్చిన నివేదికల ఆధారంగా, BA4 మరియు BA5 ఉప వేరియంట్‌లు ఒమిక్రాన్ యొక్క అసలు వెర్షన్ నుండి చాలా భిన్నంగా ఉంటాయి. దీని కారణంగా అవి మునుపటి ఇన్‌ఫెక్షన్ నుండి ఉత్పన్నమయ్యే రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం, తెలంగాణ మరియు దేశంలోని ఇతర రాష్ట్రాలలో BA2 వేరియంట్ ప్రబలంగా ఉంది. ఒమిక్రాన్ యొక్క BA2 వేరియంట్‌తో పోల్చినప్పుడు BA4 వేరియంట్ యొక్క ప్రభావం కేవలం రెండు వారాల్లోనే అసాధారణ వృద్ధి కనిపిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here