హైదరాబాద్: మెట్రో స్టేష‌న్ల వ‌ద్ద ఇకపై ఎలక్ట్రిక్ ఆటో స‌ర్వీసులు.. ప్రారంభించిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

Hyderabad Metro Rail MD NVS Reddy Launched Electric Auto Services At Parade Ground Station, Metro Rail MD NVS Reddy Launched Electric Auto Services At Parade Ground Station, Electric Auto Services At Parade Ground Station, Electric Auto Services, Hyderabad Electric Auto Services, Parade Ground Station, Metro Rail MD NVS Reddy, Electric Auto Services Launched By Metro Rail MD NVS Reddy For Hyderabad Metro, Hyderabad Metro, Electric Auto Services launched By Metro Rail MD NVS Reddy to boost connectivity for Hyderabad Metro, Electric auto services launched By Metro Rail MD NVS Reddy to improve connectivity for Hyderabad metro, Hyderabad Metro News, Hyderabad Metro Latest News, Hyderabad Metro Latest Updates, Hyderabad Metro Live Updates, Electric Auto Services for Hyderabad metro, Electric Auto Services were launched at two metro stations In Hyderabad, Mango News, Mango News Telugu,

హైదరాబాద్ లోని మెట్రో స్టేష‌న్ల వ‌ద్ద ప్రయాణికుల సౌకర్యార్ధం ‘మెట్రో రైడ్’ పేరుతో ఎల‌క్ట్రిక్ ఆటో స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ప‌రేడ్ గ్రౌండ్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద ఈ ఎల‌క్ట్రిక్ ఆటో స‌ర్వీసులను మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మెట్రో రైడ్’ సేవలను మెట్రో ప్రయాణికులందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రైవేట్ వాహనాలతో పోల్చుకుంటే మెట్రో రైడ్ ఆటోలలో చార్జీలు చాలా తక్కువని పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన స్టేష‌న్ల వద్ద వీటిని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులను మెట్రో స్టేష‌న్ల నుంచి తమ ప్రాంతానికి వెళ్ళటానికి ఈ ఎల‌క్ట్రిక్ ఆటోల‌ను ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. ప్రస్తుతం ఒక్కో రైడ్‌కు టారిఫ్ రూ. 10 గా నిర్ణయించినట్లు చెప్పారు.

ఇది రోజువారీ మెట్రో ప్రయాణికులకు ఎంతో ఉపయోగమని, బెంగళూరు, ఢిల్లీ మరియు నోయిడాలో కూడా పనిచేస్తున్న మెట్రోరైడ్.. వారి అన్ని ఎలక్ట్రిక్ ఆటో ఫ్లీట్ మరియు బలమైన AI ఎనేబుల్డ్ టెక్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి సేవలను అందిస్తుందని వెల్లడించారు. క‌రోనా మహమ్మారి కారణంగా హైద‌రాబాద్ మెట్రో సంస్థకు రూ. 3 వేల కోట్ల భారీ న‌ష్టం వాటిల్లింద‌ని తెలిపారు. లాక్‌డౌన్ లకు ముందు ప్ర‌యాణికుల సంఖ్య 4 ల‌క్ష‌లు ఉండేదని, అయితే ప్ర‌స్తుతం రోజుకు 2.7 ల‌క్ష‌ల మంది మెట్రో రైళ్లలో ప్ర‌యాణిస్తున్నార‌ని చెప్పారు. త్వరలో రూ. 5 వేల కోట్ల‌తో మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి ప్ర‌ణాళిక రూపొందించామ‌ని, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో సేవ‌ల‌ను అందించటానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సేవలు ప్రస్తుతం రెండు మెట్రో స్టేషన్లలో (పరేడ్ గ్రౌండ్స్ మరియు రాయదుర్గ్) అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే నగరంలోని ఇతర మెట్రో స్టేషన్లలో కూడా సేవలను విస్తరించే యోచన చేస్తున్నామని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =