తెలంగాణ: అదుపులోనే కరోనా, అయినా తప్పనిసరిగా మాస్క్ ధ‌రించాలి, లేదంటే రూ. 1000 జ‌రిమానా – డీహెచ్ శ్రీనివాస రావు

Telangana Rs 1000 Fine For Not Wearing of Masks Says DH Srinivas Rao, Director of Public Health and Family Welfare Srinivas Rao, Director of Public Health Srinivas Rao, Director of Family Welfare Srinivas Rao, 1000 Fine For Not Wearing of Masks In Telangana, 1000 Fine For Not Wearing of Masks In Telangana Says DH Srinivas Rao, DH Srinivas Rao Says 1000 Fine For Not Wearing of Masks In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, Covid-19 Updates in Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని, కానీ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని పేర్కొన్నారు ప్ర‌జారోగ్య సంచాల‌కులు (డీహెచ్) శ్రీనివాస రావు. అయితే తెలంగాణలో తప్పనిసరిగా మాస్క్ ధ‌రించాలని, లేదంటే రూ. 1000 వరకు జ‌రిమానా విధించబడుతుందని వెల్లడించారు. ప్రస్తుతం మన దగ్గర రోజుకు 20-25 కరోనా కేసులు నమోదవుతున్నాయని, కానీ దేశంలోని ఇతర రాష్ట్రాలైన ఢిల్లీ, హర్యానా, యూపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలో ఫోర్త్‌వేవ్‌పై అందరికీ అనుమానాలు ఉన్నాయని, సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్‌ వేవ్ రాదని డీహెచ్‌ స్పష్టం చేశారు. చైనా, తైవాన్, ఈజిప్టు వంటి దేశాలలో కేసులలో పెరుగుదల భారీగా ఉంటోందని, అందుకే మనం ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు నెల‌లు మనకు చాలా కీలకమని, శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరిగే అవకాశం ఉన్నందున రాష్ట్రం లోని ప్ర‌తి ఒక్క‌రూ ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రెండు విడతల వ్యాక్సిన్ డోసులు వేసుకోవాలని, అర్హులైన వారు బూస్టర్ డోసులు కూడా తీసుకోలేని సూచించారు. 60 సంవ‌త్స‌రాలు దాటిన సీనియర్ సిటిజన్లు గవర్నమెంట్ హాస్పిటల్స్ వద్ద బూస్ట‌ర్ డోసులు వేయించుకునే అవకాశం ఉందని, దీనిని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఇంకా అర్హులైన టీనేజర్స్ సెకండ్ డోస్ కూడా తీసుకోవచ్చని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధ‌రించడం, భౌతిక దూరాన్ని పాటించడం ద్వారా మహమ్మారి నుండి రక్షణ పొందుదామని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 3 =