సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడ‌మీకి నోటీసులు, డైరెక్టర్ అరెస్ట్

Hyderabad Sai Defence Academy Director Arrested by Railway Police Over Secunderabad Railway Station Incident, Hyderabad Sai Defence Academy Director Arrested by Railway Police, Sai Defence Academy Director Arrested by Railway Police, Secunderabad Railway Station Incident, Railway Police, Hyderabad Sai Defence Academy Director Arrested, Sai Defence Academy Director Arrested, Hyderabad Sai Defence Academy, Sai Defence Academy, Secunderabad violence, Railway cops to arrest Hyderabad Sai Defence Academy Director Subbarao, police arrested Sai Defence Academy director Avula Subbarao in connection with Secunderabad violence, Secunderabad riots case, Secunderabad Railway Station Incident News, Secunderabad Railway Station Incident Latest News, Secunderabad Railway Station Incident Latest Updates, Secunderabad Railway Station Incident Live Updates, Mango News, Mango News Telugu,

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో రైల్వే పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. దీనికి ప్రధాన సూత్రధారిగా రిటైర్డ్ ఆర్మీ మెడికల్ అసిస్టెంట్, సాయి డిఫెన్స్ అకాడ‌మీ డైరెక్టర్ అయిన ఆవుల సుబ్బారావును గుర్తించారు. అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ గత వారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనలు, విధ్వంసంలో సుబ్బారావు ప్రధాన పాత్ర పోషించాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో రైల్వే పోలీసులు ఆయనను శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత బోయిగూడ రైల్వే కోర్టులో సుబ్బారావును హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు. ఇదే క్రమంలో మేడిప‌ల్లిలోని సాయి డిఫెన్స్ అకాడ‌మీకి రైల్వే యాక్ట్ 1989 కింద నోటీసులు జారీ చేశారు రైల్వే పోలీసులు.

సాయి డిఫెన్స్ అకాడ‌మీ లోని రికార్డులు, ఆధారాల పత్రాలతో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తొలుత డైరెక్టర్‌ను కొన్ని రోజుల క్రితం పల్నాడు పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతనికి వ్యతిరేకంగా ఎటువంటి నేరారోపణ సాక్ష్యం లభించకపోవడంతో అతన్ని విడిచిపెట్టారు. ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌ బ్లాక్‌, ఇండియన్‌ ఆర్మీ గ్రూప్‌, హకీంపేట్‌ ఆర్మీ సోల్జర్స్‌ గ్రూప్‌ తదితర పేర్లతో వాట్సాప్‌ గ్రూపులను సృష్టించారని, వాటి ద్వారా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. సుబ్బారావు ఆందోళనకారులకు అందించారని, వసతి, భోజనం వగైరా సమకూర్చారని పోలీసుల విచారణలో బయటపడింది. అలాగే తన అనుచరులైన హరి, శివ, రెడ్డప్ప, మల్లారెడ్డి విద్యార్థులను రెచ్చగొట్టి విధ్వంసానికి పాల్పడేలా ప్రోత్సహించారని పోలీసులకు ఆధారాలు లభించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =