హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం-2022 ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎస్‌ సోమేశ్ కుమార్

Hyderabad Telangana CS Somesh Kumar Held Review on Ganesh Immersion-2022 Arrangements, Telangana CS Somesh Kumar Held Review on Ganesh Immersion-2022 Arrangements, CS Somesh Kumar Held Review on Ganesh Immersion-2022 Arrangements, IAS Somesh Kumar Held Review on Ganesh Immersion-2022 Arrangements, Somesh Kumar Held Review on Ganesh Immersion-2022 Arrangements, Review on Ganesh Immersion-2022 Arrangements, Ganesh Immersion-2022 Arrangements, Hyderabad Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar, CS Somesh Kumar, Telangana Chief Secretary Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Hyderabad Telangana Chief Secretary Somesh Kumar, Ganesh Immersion-2022 Arrangements News, Ganesh Immersion-2022 Arrangements Latest News, Ganesh Immersion-2022 Arrangements Latest Updates, Ganesh Immersion-2022 Arrangements Live Updates, Mango News, Mango News Telugu,

హైదరాబాద్‌లో సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బీ.ఆర్.కె. ఆర్ భవన్ లో జరిగిన ఈ సమావేశానికి డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు సి.వి. ఆనంద్, మహేష్ భగవత్, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, కాలుష్య నియంత్రణా మండలి కార్యదర్శి నీతూ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సి.ఎస్. సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరంలో కాలుష్య కారక గణేష్ విగ్రహాలను ఉపయోగించవద్దని రాష్ట్ర హైకోర్ట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మట్టి వినాయకుల విగ్రహాలు వినియోగించే విధంగా నగర వాసులను చైతన్య పర్చాలని అధికారులకు సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సింథటిక్ కలర్స్ వంటి పర్యావరణ హాని కారక కెమికల్స్ ను విగ్రహాల తయారీలో నిషేధిస్తూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ఇతర చెరువుల్లో కూడా నిమజ్జనం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై విగ్రహ తయారీదారులను చైతన్య పర్చాలని అధికారులకు సూచించారు. నగరంలో మట్టి వినాయకుల తయారీ దార్లను ప్రోత్సహించడం తోపాటు మట్టి విగ్రహాల మార్కెటింగ్ కు తగు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. హై కోర్టు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించేందుకు చర్యలు తీసుకోవాలని సోమేశ్ కుమార్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 2 =