ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదు, రెండు సిద్ధాంతాల మధ్య పోరు మాత్రమే – యశ్వంత్ సిన్హా

Yashwant Sinha Statement Over Presidential Elections The Fight Between Two Ideologies, The Fight Between Two Ideologies, Yashwant Sinha Statement Over Presidential Elections, Sinha Statement Over Presidential Elections, Presidential Elections, 2022 Presidential Elections, Presidential Elections 2022, Opposition Party's Presidential Candidate Yashwant Sinha, Presidential Candidate Yashwant Sinha, Yashwant Sinha, Presidential Candidate, Candidate Yashwant Sinha, Two Ideologies, Presidential Elections 2022 News, Presidential Elections 2022 Latest News, Presidential Elections 2022 Latest Updates, Presidential Elections 2022 Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైద‌రాబాద్ జ‌ల‌విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన మ‌ద్ద‌తు స‌భ‌లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అనంతరం సిన్హా మాట్లాడుతూ.. త‌న‌కు తెలంగాణ‌లో ఇంతటి ఘ‌నస్వాగ‌తం ల‌భిస్తుంద‌ని అనుకోలేదని, అంద‌రికీ ధ‌న్య‌వాదాలని అన్నారు. తెలంగాణ ప్రజలలో చైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానని, వారి పోరాట పటిమ రాష్ట్రం సాధించుకున్నప్పుడే దేశానికంతటికీ అర్థమైందని య‌శ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు, ఇద్దరి ఆలోచనలు మరియు సిద్ధాంతాల మధ్య పోటీ అని య‌శ్వంత్ సిన్హా పేర్కొన్నారు. టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ ఢిల్లీ వచ్చి తన‌కు మద్దతు ప్రకటించడం నైతిక బలాన్నిచ్చిందని అన్నారు. ఇక ఎన్నో రోజులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నామని, రాష్ట్రపతి ఎన్నిక తరువాత కూడా మా పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. వారి ఆలోచనలను ఒక వ్యక్తి పదే పదే చెబుతుంటే దేశంలోని 135 కోట్ల మంది ప్రజలు వినాల్సి వస్తోందని, ప్రధానిని ఉద్దేశించి పేర్కొన్నారు. నియంతృత్వ పోకడలు దేశ క్షేమానికి శ్రేయస్కరం కాదని య‌శ్వంత్ సిన్హా తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 7 =