హైదరాబాద్‌లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Hyderabad Union Home Minister Amit Shah Inaugurates National Cyber ​​Forensic Lab at Ramanthapur, Union Home Minister Amit Shah Launches National Cyber ​​Forensic Lab at Ramanthapur, Minister Amit Shah Starts National Cyber ​​Forensic Lab at Ramanthapur, Home Minister Amit Shah Inaugurated National Cyber ​​Forensic Lab at Ramanthapur, National Cyber ​​Forensic Lab at Ramanthapur, Ramanthapur National Cyber ​​Forensic Lab, National Cyber ​​Forensic Lab, Ramanthapur, Union Home Minister Amit Shah, Home Minister Amit Shah, Minister Amit Shah, Union Home Minister, Amit Shah, Telangana Tour, Union Home Minister Amit Shah Telangana Tour, Home Minister Amit Shah Telangana Tour, Amit Shah Telangana Tour, Amit Shah Telangana Tour News, Amit Shah Telangana Tour Latest News, Amit Shah Telangana Tour Latest Updates, Amit Shah Telangana Tour Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకరోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ విచ్చేశారు. తన పర్యటనలో భాగంగా తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు.. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, సీనియర్ నేత మురళీధర్ రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ మంత్రి వివేక్, ప్రముఖ నేత విజయశాంతి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో రామంతపూర్‌ చేరుకొని, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని సందర్శించారు. అనంతరం నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (ఎన్‌సిఎఫ్‌ఎల్)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇదే విషయాన్ని అమిత్ షా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

డిజిటల్ డివిజన్ లోని ఎన్‌సిఎఫ్‌ఎల్ ప్రారంభించిన అనంతరం కేంద్ర హోంమంత్రి అక్కడి టెక్నీషియన్లతో సంభాషించారు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో.. నేరాల నిర్ధారణలో వినియోగించనున్న కొత్త ఎక్విప్ మెంటు పనితీరుని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అమిత్ షా తిరిగి శంషాబాద్ వెళ్లనున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించిన రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా జరుగనున్న బహిరంగసభలో అమిత్ షా పాల్గొననున్నారు. హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ఈ సాయంత్రం బహిరంగ సభ జరుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 8 =