తెలంగాణ: నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక.. తెలంగాణకు చేసిందేమిటంటూ 27 ప్రశ్నలు సంధించిన మంత్రి కేటీఆర్

Minister KTR's 27-Questions Open Letter To Union Home Minister Amit Shah Ahead of Telangana Visit, Telangana Minister KTR's 27-Questions Open Letter To Union Home Minister Amit Shah Ahead of Telangana Visit, KTR Writes An Open Letter To Amit Shah Questions Discrimination To Telangana, KTR Writes An Open Letter To Amit Shah, KTR Questions Discrimination To Telangana, Discrimination To Telangana, Minister KTR Writes An Open Letter To Amit Shah, Minister KT Rama Rao wrote an open letter to the Union Home Minister Amit Shah, letter was a barrage of questions in form of an open letter regarding the coals, KT Rama Rao pointed out the discrimination government at the Centre had against Telangana State, discrimination government, Union Home Minister Amit Shah, Home Minister Amit Shah, Minister Amit Shah, Union Home Minister, Minister KTR Issues Legal Notice MP Bandi Sanjay Kumar, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణా పర్యటనకు రానున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై 27 ప్రశ్నలు సంధిస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని, తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని బీజేపీ నెరవేర్చలేదని ఆరోపించారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపుతోందని, తెలంగాణపై మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పాల్గొననున్న బహిరంగ సభలో తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులతో సహా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద చేసిన వాగ్దానాలపై మంత్రి కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖలోని ముఖ్యమైన ప్రశ్నలలో కొన్ని..

 • విభజన చట్టంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా మీ ప్రభుత్వం నెరవేర్చిందా?
 • అన్ని అర్హతలు ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా, 20 వేల కోట్లతో మీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కారణమేంటి?
 • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐఎం, ఐసర్, ఏన్ఐడి, ట్రిబుల్ ఐటీ, గిరిజన విశ్వవిద్యాలయం, నవోదయ విద్యాలయాలతో పాటు మెడికల్ కాలేజీలలో ఏ ఒక్కటైనా తెలంగాణకు కేటాయించారా?
 • విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక ఐటిఐఆర్ ను ఎందుకు రద్దు చేశారు?
 • పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని మీ పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ గారు 2014లో ఇచ్చిన హామీ ఏమైంది?
 • మిషన్ కాకతీయ.. మిషన్ భగీరథ లాంటి అద్భుతమైన ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు అందించాలని నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా, ఇప్పటిదాకా ఒక్క పైసా అయినా కేటాయించారా?
 • హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే ప్రజలకు నయాపైసా ఇవ్వకుండా పక్షపాతం చూపించిన మీరు,  ఇప్పుడు ఎవరిని ఉద్దరించడానికి నగరానికి వస్తున్నారు?
 • కోవిడ్ సంక్షోభ సమయంలో హైదరాబాద్ ఫార్మా రంగం.. వ్యాక్సిన్ల తయారీతో ప్రపంచానికి అండగా నిలిచినందుకు.. కేంద్రం తరఫునుంచి ఏమైనా ప్రోత్సాహకాలు అందించారా?
 • తెలంగాణ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఎందుకు కొనుగోలు చేయలేదో చెప్పగలరా?
 • మీ నిజామాబాద్ ఎంపి, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు బాండ్ పేపర్ పై రాసిచ్చిన హమీ ఏమైంది?
 • వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కానీ చివరకు దాన్ని గుజరాత్ కు తీసుకెళ్లారు. ఇది తెలంగాణపై మీ పక్షపాత వైఖరి కాదా?

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here