హంగ్ వస్తే.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరు..?

If hung who will be the king maker,who will be the king maker,If hung who will be,telangana assembly elections, congress, brs, bjp, mim, hung,Mango News,Mango News Telugu,Telangana Politics,Telangana Election Result 2023,Telangana Assembly Election Results LIVE 2023,Telangana Election Results,Telangana Political News And Updates,Telangana assembly elections Latest News,Telangana assembly elections Latest Updates
telangana assembly elections, congress, brs, bjp, mim, hung

తెలంగాణలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది. మూడో తేదీన వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌కే పట్టం కడుతున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నప్పటికీ.. కొన్ని సర్వేల్లో మాత్రం హంగ్ వచ్చే అవకాశం ఉందని తేలింది. దీంతో తెలంగాణలో హంగా రానుందా?.. వస్తే ఏంటి పరిస్థితి?.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరు? అనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది.

అయితే కొన్ని సర్వేలు అధికార బీఆర్ఎస్ పార్టీకి సింపులు మెజారిటీ ఇవ్వగా.. మరికొన్ని సర్వేలు మాత్రం 50 నుంచి 60 సీట్లు వస్తాయని తేల్చేశాయి. అయితే ఏది ఏమయినప్పటికీ బీఆర్ఎస్‌కు 45 సీట్లు తప్పకుండా వస్తాయని  విశ్లేషకులు అంటున్నారు. అటు మ్యాజిక్ ఫిగర్ 60గా ఉంది. అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ఎలాగైనా మ్యాజిక్ ఫిగర్‌కి చేరుకోవాలి. బీఆర్ఎస్‌కి మాత్రం 50 సీట్లు వచ్చినా కూడా అధికారంలోకి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్‌కు సీట్లు తక్కువ పడితే కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు అటు ఎంఐఎం సిద్ధంగా ఉంది.

అటు బీజేపీకి తక్కువలో తక్కువ 6 సీట్లు ఎటూపోవని సర్వేలు చెబుతున్నాయి. ముందు నుంచి కూడా బీజేపీ తాము కింగ్ మేకర్ పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఎవరికి మద్ధతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌కు ఎట్టిపరిస్థితిలోనూ బీజేపీ మద్ధతు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మిగిలిన బీఆర్ఎస్‌కే బీజేపీ మద్ధతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి డిసెంబర్ 3న ఏం జరగబోతోంది.. ఈ పార్టీ జెండా ఎగరబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =