హంగ్ ఏర్పడితే సీఎం పదవి డిమాండ్ చేసే అవకాశం?

Master plan behind BJPs silence,Master plan behind BJP,Behind BJPs silence,BJPs silence,Telugu Congress, Telangana Politics,BJP New Strategy After Elections , BJP , BRS , Congress , Politics ,Bandi Sanjay Kumar , Telangana Politics,BJP's silence,Mango News,Mango News Telugu,Telangana Election Result 2023,Telangana Assembly Election Results LIVE 2023,Telangana Election Results,Telangana Politics, Telangana Political News And Updates
Telugu Congress, Telangana-Politics,BJP New Strategy.. After Elections , BJP , BRS , Congress , Politics ,Bandi Sanjay Kumar , Telangana Politics,BJP's silence,

ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకోవడం తగ్గింది కానీ.. అంతకు ముందు నువ్వొకటి అంటే నేను రెండు అంట అన్న లెక్కల్లో ఉండేవి. ఇక సీఎం కేసీఆర్ అయితే డైరక్టుగా మోడీపైనే ఘాటు పంచులు వేసేవారు. ఎప్పుడయితే కవిత లిక్కర్ స్కామ్ విషయం వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచీ గులాబీ బాస్ సైలెంట్ అయిపోయారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. టార్గెట్ కాంగ్రెస్ గానే గులాబీ దళం వ్యవహరించింది.

మరోవైపు తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని మొదటి నుంచి చెబుతూ వచ్చిన కమలనాథులు కూడా.. సరిగ్గా ఎన్నికల ముందు మాత్రం సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా కర్నాటకలో ఓడిపోయాక .. ఎందుకో తెలంగాణ లోని నేతలు కూడా కామ్ అయ్యారు. చివరకు తాడో పేడో తేల్చుకోవాల్సిన  తెలంగాణ కమలనాథులు  విన్నింగ్ టార్గెట్‌ అంశాన్ని పట్టించుకోవడమే మానేసారు. దానికి తోడు పార్టీలో బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కూడా  బీజేపీపై గట్టిగానే ప్రభావం చూపించింది.

అప్పటి నుంచే కాషాయ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగి ఎన్నికల రేస్‌లో బాగా వెనుకబడింది. సరిగ్గా ఇదే సమయాన్ని  కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకుంది.  తెలంగాణలో  బీజేపీ ఇమేజ్‌ను కాంగ్రెస్ గట్టిగానే దెబ్బతీసింది.  ఎన్నికల ముందు కమలం పార్టీ హడావిడి పూర్తిగా తగ్గడానికి కారణం అయింది. అయితే ఇదంతా బీజేపీ మాస్టర్ ప్లాన్‌లో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో వార్ వన్ సైడ్ అనేటట్టుండే బీఆర్ఎస్ ఇప్పుడు బాగా వీకయింది. ఇదే సమయంలో తాము  ఎంత గింజుకున్నా.. కాంగ్రెస్ పార్టీనే రెండో పార్టీ అని తెలంగాణ వాసులు ఫిక్సయినట్లు బీజేపీ గుర్తించింది.

అందుకే ఎలాగూ ఈ అసెంబ్లీ  ఎన్నికల్లో గెలిచి అధికారం సంపాధించడం కష్టమేనని లెక్కలు వేసిన బీజేపీ అధిష్టానం.. వాట్ నెక్స్ట్ అనే దానిపైనే ఎక్కువ దృష్టి సారించింది.ఈ ఎన్నికలలో బీ‌ఆర్‌ఎస్ , కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుండటంతో రెండు పార్టీలక్లు మెజారిటీ ఓటు షేర్ లభించడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్‌కు పట్టం కట్టినా.. తెలంగాణలో  హంగ్ ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నట్లు తేల్చారు. అదే కనుక జరిగి హంగ్ ఏర్పడితే బీజేపీ కీరోల్ పోషించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ 8-15 స్థానాల్లో సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే అటు బీ‌ఆర్‌ఎస్ అధికారం చేపట్టాలన్న లేదా  హస్తం పార్టీ అధికారం చేపట్టాలన్న కూడా బీజేపీ మద్దతే చాలా కీలకంగా మారే అవకాశం ఉంది.  బీజేపీ..కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం లేదు కాబట్టి..బీజేపీ బీ‌ఆర్‌ఎస్‌‌తోనే కలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అలా  బీ‌ఆర్‌ఎస్‌తో బీజేపీ కలవాల్సివస్తే.. కొన్ని కీలక పదవులతో  పాటు..మరికొన్ని  ముఖ్యమైన డిమాండ్లను ఆ పార్టీ ముందు పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతెందుకు బీజేపీ వ్యూహం సక్రమం  ఫలిస్తే ఏకంగా  సీఎం పదవిని కూడా బీజేపీ పెద్దలు డిమాండ్ చేసే అవకాశం ఉండొచ్చు. అందుకే ప్రస్తుతం బీజేపీ సైలెంట్‌గా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఆ పార్టీ స్ట్రాటజీని ఫాలో అయి అసలు గేమ్‌ను మొదలుపెడుతుందని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 6 =