నాలుగోసారి కూడా అహ్మద్ బలాలా గెలుస్తారా?

Will Ahmed Balala win for the fourth time,Will Ahmed Balala win,win for the fourth time,Balala win for the fourth time,Malakpet, majlis, Ahmed Balala win, Ravinder Reddy, election campaign, Sanreddy Surender Reddy, Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,Mango News,Mango News Telugu,Ahmed Balala win Latest News,Ahmed Balala win Latest Updates,Ahmed Balala Latest News,Telangana Political News And Updates,Telangana assembly elections Latest News
Malakpet, majlis, Ahmed Balala win, Ravinder Reddy, election campaign, Sanreddy Surender Reddy, Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,

అనుక్షణం ఉత్కంఠను రేపుతూ జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్  ప్రక్రియ ముగియడంతో అందరి కళ్లూ.. రేపు విడుదల కానున్న   ఫలితాల మీదే ఉన్నాయి. దీంతో మలక్‌పేట నియోజకవర్గంలో గెలుపెవరి అనేదానిపైన కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ నుంచి ప్రధాన పార్టీలు పోటీకి దిగడంత.. ఎంఐఎం,బీజేపీ,కాంగ్రెస్,బీఆర్‌ఎస్‌ మధ్యలో రాజకీయ రణరంగం నెలకొంది.

మూడు సార్లు నుంచి మలక్ పేట్  ఎంఐఎం అభ్యర్థి అహ్మద్‌ బలాలా .. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పాగా వేయడంతో.. ఈసారి కూడా అహ్మద్‌ బలాలా తాను నాలుగోసారి కూడా విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు.  మైనార్టీ ఓట్లు, నియోజకవర్గంలో అభివృద్ధి, హిందువుల ఓట్లపై మొదటి నుంచీ నమ్మకం పెట్టుకున్న బలాలా.. మెజార్టీ పెంచుకోవడంపైనే దృష్టి సారిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ప్రాంతానికి చెందిన కుల సంఘాలు  కూడా ఎంఐఎం అభ్యర్థికే మద్దతు పలుకుతూ బీజేపీ అభ్యర్థికి షాక్ ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.

కానీ బీజేపీ మాత్రం ఈసారి కచ్చితంగా తమ పార్టీ గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేసింది. కానీ ఎంఎంఐకి తాము అనుకున్నంత  స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయామని సొంత పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో రెండో స్థానం వచ్చినా పర్వాలేదని కేడర్‌ భావిస్తోంది. బీజేపీ సీటుకై ప్రస్తుత అభ్యర్ధి సంరెడ్డి సురేందర్‌రెడ్డితో  పాటు సైదాబాద్‌ కార్పొరేటర్‌ భర్త కొత్తకాపు రవీందర్‌రెడ్డి కూడా సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.  చివరకు ఎన్నికలలో ప్రచారం కోసం సర్వం సిద్ధం చేసుకున్నాడు. అయితే ఆఖరి నిమిషంలో ఆ సీటు సంరెడ్డి సురేందర్‌రెడ్డిని వరించడంతో.. రవీందర్‌రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యాడు.అందుకే పార్టీలో అసంతృప్తులు పెరిగి.. ఎంఎంఐకి కలిసి వచ్చే అంశంగా మారిపోయింది.

అయితే ఎన్నికల మెనేజ్‌మెంట్‌లో దిట్ట అయిన రవీందర్‌రెడ్డికి సీటు ఇస్తే.. అప్పుడు కచ్చితంగా ఎంఐఎం ఎమ్మెల్యే సీటుకు గురి పెట్టడం ఖాయమని బీజేపీ కేడర్‌లోనూ భావించారు.అంతేకాదు  రవీందర్‌రెడ్డికి సీటు కేటాయిస్తే తనకు ఇబ్బంది కలగొచ్చని సిట్టింగ్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలా కూడా కాస్త ఆందోళనకు గురయ్యారు. కానీ ఆఖరి నిమిషంలో సంరెడ్డి సురేందర్ రెడ్డికి ఇవ్వడంతో  రవీందర్ రెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికితోడు అక్కడ చాలా మంది సీనియర్లతో పాటు ఇద్దరు సిట్టింగ్‌ కార్పొరేటర్లు ఉన్నా కూడా  ఎవరికీ ఎన్నికలలో  బాధ్యతలు అప్పగించకుండా అభ్యర్థి సురేందర్ రెడ్డే  అన్నీ తానై వ్యవహరించడం బీజేపీ కేడర్ సహించలేకపోయింది.

మరోవైపు కాంగ్రెస్‌‌ అభ్యర్ధిగా పోటీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్‌ అక్బర్‌ కూడా మైనార్టీ ఓట్లపైన బాగానే ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేకపోవడంతో.. తెలుగుదేశం పార్టీ ఓట్లతో పాటు కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతో గట్టెక్కొచ్చనే నమ్మకం పెట్టుకున్నారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ మధ్య స్నేహపూర్వక పోటీ  ఉండటంతో..అధికార పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి తనకు విజయం సాధించి పెడతాయని గులాబీ పార్టీ అభ్యర్థి తీగల అజిత్‌రెడ్డి కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. మొత్తంగా డిసెంబర్‌ 3 న వెలువడే ఫలితాలతో మలక్ పేట్‌ కింగ్ ఎవరో తేలనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =