ఓ వైపు అస‌మ్మ‌తి మంటలు.. మరోవైపు అపోజిషన్ పార్టీ ఎత్తులు

Illandu Assembly Constituency Elections,Illandu Assembly Constituency,Illandu Elections,Mango News,Mango News Telugu,Illandu Assembly Constituency Elections, Congress, BRS, disagreement, opposition party,Yellandu Assembly Constituency Election Result,Yellandu Assembly Elections 2023,Telangana Politics, Telangana Political News and Updates,Hyderabad News,Telangana News,Telangana Assembly Elections,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates
Illandu Assembly Constituency Elections, Congress, BRS, disagreement, opposition party

ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ పార్టీలో సొంతనేతల అసమ్మతి మంటలు రోజురోజుకు కాకను రేపుతున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు మధ్య వర్గపోరు.. గులాబీ పార్టీకి గుబులు పుట్టిస్తోంది. హరిప్రియ, దమ్మాలపాటి గొడవలతో సీన్లోకి  హైకమాండ్‌ ఎంట్రీ ఇచ్చినా నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అపోజిషన్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతూ ఉంటే.. బీఆర్ఎస్ మాత్రం అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ కూర్చోవలసి వస్తుంది.

అవును ఇల్లందు నియోజకవర్గంలో.. అధికార బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం నిజంగానే  సెగలు రేపుతుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ తీరుపై మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు వర్గం భగ్గుమంటోంది. ఇల్లందులో ఇంటిపోరుకు దమ్మాలపాటి వెంకటేశ్వర రావు ఆజ్యం పోస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా.. ఎమ్మేల్యే దంపతుల వల్ల పార్టీ బద్నాం అయిపోయిందని..  అందుకే హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ దుమ్మాలపాటి వర్గం.. ఆ మధ్య అధిష్టానం ముందు పెద్ద  పంచాయితీ పెట్టారు. అంతేకాదు షాడో ఎమ్మెల్యేగా పని  చేస్తోన్న హరిప్రియ భర్త.. హరిసింగ్ కాంట్రాక్ట్ పనుల్లో కమీషన్లు, సింగరేణి కోల్ ట్రాన్స్ పోర్ట్ లో వాటాల వసూళ్లు మొదలెట్టారని కంప్లయింట్ చేశారు. ఈ సారి హరిప్రియకు టికెట్‌ ఇవ్వొద్దంటూ 120 మంది స్థానిక నేతలతో కలసి దమ్మాలపాటి.. మంత్రి హరీష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ విషయం ఇల్లందు నియోజకవర్గంలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

మరోవైపు అసమ్మతి నేతల ఫిర్యాదు చేసినట్లు తెలిసిన హరిప్రియ వర్గం తెగ టెన్షన్‌ పడిపోయింది.  బీ ఫామ్‌ దక్కకపోతే ఎలా అని మల్లగుల్లాలు పడింది.  అయితే సీఎం కేసీఆర్  ఏ లెక్కలు వేసారో ఏమో కానీ.. దమ్మాలపాటి వర్గం చెప్పిన మాటలను కూడా పక్కన పెట్టి  లాస్ట్‌ మినిట్‌లో  టికెట్‌ హరిప్రియకు కేటాయించారు. దీంతో తాము వద్దన్నా హరిప్రియకే టికెట్‌ ఇవ్వటంతో.. తీవ్ర ఆగ్రహంతో ఉన్న దమ్మాలపాటి వెంకటేశ్వర రావు తన ధిక్కార స్వరాన్ని  మరింత పెంచారు. దీంతో ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చేపట్టిన రాజ్యసభ మెంబర్‌ రవిచంద్ర.. దమ్మాలపాటిని బుజ్జగించే పనిలో పడినా  ఫలితం మాత్రం శూన్యంగా మిగిలింది. దీనికి తోడు  దమ్మాల పాటి వర్గం చెప్పినట్లుగానే.. ఎమ్మెల్యే  హరిప్రియ భర్త హరి సింగ్ తీసుకువస్తున్న తలనొప్పులను సర్దుబాటు చేయటం.. ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌  రవిచంద్రకు తలకు మించిన భారంగా మారిందట. దీంతో హరిప్రియకు అనవసరంగా  టికెట్ ఇచ్చామా అని టీఆర్ఎస్ అధిష్టానం తలలు పట్టుకుంటుందట.

ఇక ఎమ్మెల్యే హరిప్రియ విషయానికి వస్తే.. ఆమె 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి  ఆరు నెలల్లోనే అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇల్లందు నియోజకవర్గానికి  బస్ డిపో, సివిల్ ఆస్పత్రి అప్ గ్రేడ్‌ వంటి చిన్నిచిన్న పనులు చేయడం తప్ప నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి తీసుకురాలేదని అక్కడ జనాల్లో బాగా పాతుకుపోయింది. అంతేకాదు  బయ్యారం స్టీల్ ప్లాంట్, ఇల్లందులో మూతపడ్డ రైల్వే స్టేషన్ పునః ప్రారంభం,  సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్  వంటి హామీలు అసలు హరిప్రియకు గుర్తు కూడా లేవంటూ ఇల్లందు వాసులు గుర్రుమంటున్నారు. వీటి ప్రభావం నవంబర్‌ 30న  జరిగే ఎన్నికల్లో బాగా పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు హరిప్రియ భర్త  బీఆర్ఎస్ పార్టీకి కావాల్సినంత డ్యామేజ్ చేస్తున్నారన్న టాక్ కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఆమెకు టికెట్ ఇచ్చి కేసీఆర్ తొందరపడ్డారన్న భావన సొంతపార్టీలోనూ కనిపిస్తోంది.

ఇల్లందు నియోజకవర్గంలో అధికార పార్టీ వ్యవహారం ఇలా ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీలో నేతల తీరు కూడా తామేం తీసిపోం అన్నట్లుగానే ఉంది. బీఆర్ఎస్ పార్టీని మించిన  వర్గపోరుతో రోజుకో నేత రోడ్డుకెక్కుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీలో హరిప్రియకు కావాల్సినంత చెడ్డపేరుతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి  భారీగా ఓట్ బ్యాంకు ఉన్నా కూడా.. హస్తం పార్టీని ముందుండి నడిపించే సరైన లీడర్ లేకపోవటం కాంగ్రెస్‌కు పెద్ద  మైనస్‌ అయిందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక పొంగులేటి శ్రీనివాస్ అనుచరుడు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య బీఆర్ఎస్‌ పార్టీకి  రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరటం కాంగ్రెస్‌కు కాస్త కుదురుపడే విషయంగానే అంటున్నారు విశ్లేషకులు. కోరం కనకయ్యకే టికెట్‌ ఖాయం కానుందన్న ప్రచారం మొదలవడంతో..ఇప్పటికే కనకయ్య కావాల్సినంత  గ్రౌండ్‌ వర్క్‌ మొదలు పెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ నుంచి అధికారికంగా బీఫామ్‌ పుచ్చుకున్నాక ..  ప్రచారంలో స్పీడు పెంచాలని కనకయ్య సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఈసారి ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య రసవత్తరమైన ఖాయమంటున్నారు స్థానికులు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + ten =