తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. ఏకకాలంలో ఇళ్లు, ఆఫీసులపై దాడులు

Income Tax Raids On Telangana Minister Malla Reddy Houses And Offices In Hyderabad,It Officials Raids,It Raids On Trs Minister Malla Reddy,Trs Minister Malla Reddy,Mango News,Mango News Telugu,Malla Reddy It Raids,It Raids On Malla Reddy And His Kin,Income Tax Department,Telangana It Dept Raids,Telangana It Raid On Minister Malla Reddy,Malla Reddy It Raids ,It Raids Latest News And Updates

ఇటీవలి కాలంలో తెలంగాణలోని ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తుండటం తెలిసిన విషయమే. తాజాగా మంత్రి చామకూర మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, సోదరుడు గోపాల్ రెడ్డి మరియు ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు ప్రారంభించింది. ఐటీ శాఖకు చెందిన 50 మంది అధికారుల బృందం ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని వారి కార్యాలయాలలో కూడా సోదాలు జరుపుతోంది. మంత్రికి చెందిన మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. దూలపల్లిలోని మల్లారెడ్డి కాలేజీ నుంచి అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంట తీసుకెళ్లిన కౌంటింగ్ మెషీన్ ద్వారా అధికారులు నగదుని లెక్కిస్తున్నారు. కాగా మంత్రి కుమారుడు మహేందర్ రెడ్డికి చెందిన కొంపల్లిలోని నివాసం, కూతురు, అల్లుడికి సంబంధించిన నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో కూడా అధికారులు ముమ్ముర తనిఖీలు చేస్తున్నారు. ఇక మహేందర్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా గత కొన్ని రోజుల కిందట మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లపై కూడా ఐటీ శాఖ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here