కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..

ongoing assembly election counting,assembly election counting,ongoing counting,Telangana Assembly Elections, Polling, Counting, Telangana,Assembly Election Results,Telangana Election Results highlights,Mango News,Mango News Telugu,Telangana Election Result 2023,Assembly Election 2023 News,Telangana Politics,Telangana Assembly polls,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates
Telangana Assembly Elections, Polling, Counting, Telangana,

యావత్ తెలంగాణ ఎంతో ఉత్కంఠకరంగా ఎదురు చూస్తున్న కీలక ఘట్టం ప్రారంభయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు ఎవరు ఆధిక్యంలో ఉన్నారనే విషయం తేలిపోయే అవకాశం కనిపిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 14 లెక్కింపు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్లను.. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు లెక్కింపు కేంద్రాల్లో.. మిగిలిన జిల్లాల్లో ఒక్కొక్క ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. చిన్న నియోజకవర్గాల్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొదట భద్రాచలం, చార్మినార్ ఫలితాలు.. చివరికి శేరిలింగంపల్లి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,766 కౌంటింగ్ టేబుల్స్‌పై అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్.. మిగిలిన నియోజకవర్గాల్లో 14 టేబుల్స్‌పై ఓట్లను కౌంట్ చేస్తున్నారు. ప్రతీ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి మొత్తం నలుగురు సిబ్బంది ఉన్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో తెలంగాణలో అధికారం ఎవరిదనేది తేలిపోనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 4 =