అంతర్జాతీయ మహిళా దినోత్సవం: మహిళా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

International Women's Day Minister KTR Participates in Telangana Govt's Honouring Women in Journalism Event,International Women's Day,Minister KTR Participates,Telangana Govt's Honouring Women,Telangana Journalism Event,Mango News,Mango News Telugu,Telangana Govt Announces Awards,Rs.1 Lakh Cash Reward,27 Women on Occasion of International Women's Day,International Women's Day,Telangana CM KCR,CM KCR,Telangana CM KCR Latest News And Updates,Telangana International Women's Day,Telangana Women's Day,Women's Day Celebrations,Women's Day

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా జర్నలిస్టుల సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేసిందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మంగళవారం నాడు మహిళా జర్నలిస్ట్ లకు పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మహిళా జర్నలిస్టుల కొరకు వి-హబ్ ద్వారా 2 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల కుటుంబాలకు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మహిళ జర్నలిస్టులు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జర్నలిస్టులు అందరికి 19 వేల ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చామన్నారు. గుజరాత్ లో కేవలం 3 వేలు కార్డులు మాత్రం ఉన్నాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమర్థవంతంగా పని చేస్తున్నారు. జర్నలిస్టులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మీడియా సంస్థలు కూడా పాజిటివ్ ప్రచారం చేయాలని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయా ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేస్తున్న 138 మంది మహిళ జర్నలిస్ట్ లకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డ్ ల ప్రధానం జరిగింది. మహిళా జర్నలిస్టులు సామాజిక బాధ్యతగా తమ వంతు కృషి చేయాలని, సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనల పట్ల మీరు కూడా స్పందించి అవగాహన వార్తలు ప్రసారం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, సమాచార శాఖ కమిషనర్, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్లు నాగయ్య కాంబ్లీ, కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, కె.వెంకట రమణ, డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, యాస వెంకటేశ్వర్లు, ఎస్ ఏ హష్మీ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ రాధా కిషన్, జయా రాంమూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని ఇతర అధికారులు, శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =