ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఆమోదం తెలిపింది. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుంచి, వ్యక్తిగత కారణాల వల్ల మరో ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతున్నానని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వీఆర్ఎస్ కు ఆమోదం తెలుపుతూ ప్రవీణ్ కుమార్ ను విధుల నుంచి రిలీవ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయన స్థానంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ