పాతికేళ్లు నిండకుండానే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం, అగ్నిప్రమాదాల నివారణపై దృష్టిపెట్టాలి: పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Responds over Secunderabad Swapnalok Blaze Mishap Incident,Janasena Chief Pawan Kalyan,Pawan Kalyan Responds over Secunderabad Incident,Janasena Chief Responds on Swapnalok Blaze Mishap,Swapnalok Blaze Mishap Incident,Mango News,Mango News Telugu,Secunderabad Fire Accident,Massive Fire Mashup at Swapnalok Complex,Swapnalok Complex Secunderabad,Four Women Lost Lives in Massive Fire Mashup,Secunderabad Fire Mashup News Today,Secunderabad Swapnalok Complex Live News,Secunderabad Fire Accident Live News,Secunderabad Fire Accident Live Updates,Janasena Chief Pawan Kalyan Latest Updates

సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పాతికేళ్లు కూడా నిండని నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందటం చాలా దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉద్యోగం కోసం పొట్ట చేత్తో పట్టుకొని రాజధానికి వచ్చిన తెలంగాణ బిడ్డలు ఈ ప్రమాదంలో అశువులు బాయడం చాలా బాధించిందన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

“కాల్ సెంటర్ లో పనిచేస్తున్న వీరంతా దిగువ మధ్యతరగతి కుటుంబాల వారని తెలిసింది. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఎలా బయటపడాలో తెలియక పొగతో ఉక్కిరిబిక్కిరి అయి చివరకు ఆసుపత్రిలో వీరంతా ప్రాణాలు విడిచారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. అనేక కార్యాలయాలు, వాణిజ్య దుకాణాలు ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూలంకషంగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలి. ఎందుకంటే సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక కాంప్లెక్స్ లో ఇటీవలే ప్రమాదం జరిగి ముగ్గురు మరణించారు. ఇప్పుడు ఈ ప్రమాదం, ఈ ఘటన మానవ తప్పిదమా?, అజాగ్రత్త వల్లా?, భవన నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడమా అనేది తెలియవలసి ఉంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి దీనివల్ల అవకాశం కలుగుతుందని భావిస్తున్నాను. తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కార్యాలయ సముదాయాలు, షాపింగ్ మాల్స్ ను తనిఖీ చేయడంతోపాటు అక్కడి విద్యుత్ లైన్ల నిర్వహణను పరిశీలించాలి. స్వప్నలోక్ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలి. అదే విధంగా కడుపు కోతకు గురైన కుటుంబాల వారికి తగినంత నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 8 =