బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక

KCR And Telangana Governor Extend Bathukamma Wishes,Mango News,Mango News, Latest Political Breaking News,Telangana Breaking News Today,Governor wishes Telangana on Bathukamma,KCR Bathukamma Wishes,Telangana Governor Bathukamma Wishes

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ ప్రాంత సంస్కృతికి బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని కేసీఆర్ అన్నారు. ఆయన బతుకమ్మ పండుగ ఉత్సవాలను తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. ఈ పండుగ రాష్ట్ర సంస్కృతి మరియు సాంప్రదాయాన్ని తెలియజేస్తుందని అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. సెప్టెంబర్ 28, శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను జరుపుకోనున్నారు, 9 రోజుల పాటు గ్రామాలు, పట్టణాల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడ బతుకమ్మ పండుగ శుభ సందర్భంగా మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచిస్తుందని చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. అక్టోబర్‌ 2న మహాత్మాగాంధీ 150వ జయంతి పురస్కరించుకుని ప్రతి గ్రామ పంచాయతీలో ఉత్సవాలు నిర్వహిస్తారు. అక్టోబర్‌ 4న రాష్ట్రంలోని ఉన్న అన్ని నగరాల్లో బతుకమ్మ పూల పండగను ప్రత్యేకంగా జరపనున్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + one =