ఏపీ రాజధాని మార్పుపై కిషన్ రెడ్డి స్పందన

Andhra Pradesh Capital Change, Kishan Reddy Over Andhra Pradesh Capital Change, Kishan Reddy Responds Over Andhra Pradesh, Kishan Reddy Responds Over Andhra Pradesh Capital, Kishan Reddy Responds Over Andhra Pradesh Capital Change, Mango News Telugu, Minister of State for Home Affairs, Minister of State for Home Affairs Government of India, Minister of State for Home Affairs Kishan Reddy

బీజేపీ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేసారు. రాజధాని అంశం కేంద్రపరిధి లోకి రాదని, ఎక్కడ నిర్మించుకోవాలనేది రాష్ట్రమే నిర్ణయించుకుంటుందని తెలిపారు. మరో వైపు హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధానిగా చేయబోతున్నారనే వార్తల్లో కూడ నిజం లేదని చెప్పారు. బుధవారం నాడు హైదరాబాద్ లోని సనత్ నగర్ లో కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ తో కలిసి ఈఎస్ఐలో మెడికల్ కాలేజ్, ఆసుపత్రులను ప్రారంభించారు మరియు ఈఎస్ఐసీ లో రూ.150 కోట్లతో నూతనంగా నిర్మించబోయే ఓపీడీ బ్లాక్ కు శంకుస్థాపన చేసారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పధకాన్ని తెలంగాణాలో కూడ అమలు చేయాలనీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదనటం మంచి పద్ధతి కాదని, అతను తెలియకుండానే గతంలో కేటీఆర్ నడ్డాను ఎలా కలుసుకున్నారని ప్రశ్నించారు. త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ సత్తా చాటుతుందని, అయితే బీజేపీ లక్ష్యం 2023లో తెలంగాణాలో అధికారంలోకి రావడమే అని చెప్పారు.

 

[subscribe]
[youtube_video videoid=8KvHll7TlTk]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − ten =