కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా అంశంపై సోనియా గాంధీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేఖ

Komatireddy Rajagopal Reddy Writes to Congress Chief Sonia Gandhi on his Resignation to Congress Party, MLA Komatireddy Rajagopal Reddy Writes to Congress Chief Sonia Gandhi on his Resignation to Congress Party, Congress MLA Komatireddy Rajagopal Reddy Writes to Congress Chief Sonia Gandhi on his Resignation to Congress Party, Rajagopal Reddy Writes to Congress Chief Sonia Gandhi on his Resignation to Congress Party, MLA Komatireddy Rajagopal Reddy Writes to Congress Chief Sonia Gandhi, Komatireddy Rajagopal Reddy Resigns to Party and MLA Post, Telangana Senior Congress Leader Komatireddy Rajagopal Reddy, Senior Congress Leader Komatireddy Rajagopal Reddy, Munugode MLA Komatireddy Rajagopal Reddy, Telangana Senior Congress Leader, MLA Komatireddy Rajagopal Reddy, Komatireddy Rajagopal Reddy, Rajagopal Reddy Resignation, By-polls in Munugodu, Congress Party Chief Sonia Gandhi, Sonia Gandhi, Congress Party Chief, Rajagopal Reddy Resignation News, Rajagopal Reddy Resignation Latest News, Rajagopal Reddy Resignation Latest Updates, Rajagopal Reddy Resignation Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ లేఖ రాశారు. లేఖలో తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

“ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా ఎక్కడ రాజీ పడకుండా కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించాను. కానీ గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తూ, విస్మరిస్తూ, పార్టీ ద్రోహులు, మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించటం నన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పటికే అనేక పార్టీలు మార్చి, స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనుల చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను” అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

“తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం అన్న విషయం మీకు తెలియనది కాదు. అరవై ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేసిన విషయం మీకు తెలిసిందే. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయింది. ఈ బంధీనుండి విడిపించేందుకు తెలంగాణలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా. అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎంఎల్ఏలల్లో మనోధైర్యం నింపి పోరాట కార్యాచరణ రూపొందించలేక కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు. అందుకే సబ్బండవర్గాలు కోరుకున్న ప్రజా తెలంగాణలో, ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నేను నిర్ణయించిన దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎం.ఎల్.ఏ పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి ఆమోదించగలరు” అని సోనియా గాంధీకి రాసిన లేఖలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − three =