ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

మాజీ మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌లో కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక స్థూపం ధ్వంసంపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రపోయిన సింహాన్ని తట్టిలేపావు, ఖబడ్దార్ చల్లా ధర్మారెడ్డి.. అంటూ హెచ్చరించారు. కాచుకో చల్లా ధర్మారెడ్డి.. నీ భరతం పడతామని సురేఖ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌లు కూడా ఏం చేయలేరని ఆమె అన్నారు. నీ పాపాలు పండేరోజు దగ్గరలోనే ఉందని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం.. అగ్రంపహాడ్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు చెలరేగిపోయిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని కొందరు కార్యకర్తలు ధ్వంసం చేసినట్లుగా చెప్తున్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతోనే వారు విధ్వంసంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై.. సొంత స్థలంలో నిర్మించుకున్న స్థూపాన్ని ఎలా ధ్వంసం చేస్తారని కొండా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here