మల్లారెడ్డా.. మజాకా.. అవ్వను ఒడిలో కూర్చోబెట్టుకొని వినూత్న ప్రచారం

Mallaredda Majaka Innovative Campaign with Avnu Sitting on Her Lap,Mallaredda Majaka,Mallaredda Innovative Campaign,Innovative Campaign with Avnu Sitting on Her Lap,Mango News,Mango News Telugu,Minister Malla Reddy, Mallareddy, Medchal Mla, Telangana Politics, Telangana Assembly Elections,Minister Malla Reddy Latest News,Minister Malla Reddy Latest Updates,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates

మంత్రి మల్లారెడ్డి..  ఆయన స్టైలే వేరు.. ఆయన రూటే సపరేటు.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మల్లారెడ్డి ఏం మట్లాడినా.. ఏం చేసినా సోషల్ మీడియా మొత్తం దద్దరిళ్లి పోతుంటుంది. పూలమ్మిన, పాలమ్మిన, చిట్ ఫండ్స్ నడిపించిన, కాలేజీలు పెట్టిన..  డైలాగ్‌తో ఒక్కసారిగా మల్లారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు. అంతేకాకుండా నిత్యం వినూత్న పనులు, డైలాగులు చెప్తూ.. జనాలను ఆకర్షిస్తుంటారు. అసెంబ్లీలో కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రత్యర్థులపై మాస్ పంచులు పేలుస్తుంటారు.

ఇక ఎన్నికలొచ్చాయంటే చాలు జనాలను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. జనాలకు హామీల మీద హామీలు గుప్పిస్తుంటారు. ఓటర్లు అడిగిన ప్రతిదానికి తలూపుతుంటార. అధికారంలోకి రాగానే చేస్తామని మాటిస్తుంటారు. కానీ మల్లారెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. తనతో సాధ్యమయ్యే పనులను మాత్రమే చేస్తానని.. ఉన్నది ఉన్నట్లుగా చెబుతుంటారు. ఇటీవల ప్రచారంలో ఓ మహిళ ఇళ్లు అడగగా.. ఈ పరిస్థితుల్లో ఇళ్లు ఇప్పివ్వడం తనతో కాదని తేల్చి చెప్పారు. తనకంటే మంచి వాడు వస్తే అతనికి ఓటు వేయాలని.. లేదంటే తనకే ఓటు వేయాలని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.

ఇప్పుడు మరోసారి మల్లారెడ్డికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. శుక్రవారం మేడ్చల్‌లో మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆయన సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఆ సమయంలో మహిళలంతా కింద కూర్చొని ఉండడంతో.. మల్లారెడ్డి కూడా వారితో కలిసి నేలపైనే కూర్చున్నారు. ఆ తర్వాత అతని వెనుక కూర్చున్న ఓ వృద్ధురాలిని ముందుకు రమ్మన్న మల్లారెడ్డి.. ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. వృద్ధురాలికి పూల బొకే ఇచ్చి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఈ వీడియోకు నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్లే పెడుతుంటే.. మరికొందరు మాత్రమే.. మంత్రిగా ఉండి ఓట్లకోసం వృద్ధురాలిని ఒడిలో కూర్చోబెట్టుకోవడం ఏంటని మండిపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =