త్వరలో రాజీనామా చేస్తా.. బీజేపీకి బాబు మోహన్ బిగ్ షాక్

Will Resign Soon Babu Mohan Is a Big Shock for Bjp,Will Resign Soon,Babu Mohan Is a Big Shock for Bjp,Babu Mohan Is a Big Shock,Mango News,Mango News Telugu,Babu Mohan, Andole, Telangana Assembly Elections, Telangana Politics, Bjp,Babu Mohans Sensational Comments,Will Bjp Leader Babu,Actor Babu Mohan Not to Contest,Babu Mohan Resigns from Bjp,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Babu Mohan Latest News,Babu Mohan Latest Updates

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ బీజేపీకి బిగ్ షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. దిగ్గజ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి.. తిరిగి సొంతగూటికి చేరారు. రెండో జాబితా వచ్చాక మరికొంత మంది పార్టీకి బై బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సినీ నటుడు, బీజేపీ నేత బాబు మోహన్ సంచలన బాంబు పేల్చారు. అసరమైతే త్వరలో బీజేపీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు.

కొద్దిరోజులుగా ఆందోల్ బీజేపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆ టికెట్ కోసం సినీ నటుడు బాబు మోహన్, ఉదయ్ పోటీ పడుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. తండ్రీ కొడుకులు ఇద్దరూ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టికెట్ తన తండ్రికి కాకుండా తనకే కేటాయించాలని ఉదయ్ అధిష్టానం వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారని వార్తలొస్తున్నాయి.

అయితే కొద్దిరోజులుగా యువకులకు, బీసీలకు, మహిళలకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తామని బీజేపీ అధిష్టానం చెబుతోంది. ఈక్రమంలో టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉదయ్‌కే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉదయ్ యువకుడు పైగా చదువుకున్న వ్యక్తి కావడంతో.. బీజేపీ అధిష్టానం కూడా ఆయనవైపే మొగ్గుచూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో బాబు మోహన్, ఉదయ్‌లకు కాకుండా మరో కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామాలపై బాబు మోహన్ స్పందిస్తూ.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయదల్చుకోలేదని వ్యాఖ్యానించారు. వచ్చే జాబితాలో తన పేరు ఉన్నా కూడా పోటీ చేయనని చెప్పుకొచ్చారు. బీజేపీ లిస్టుల పేరుతో చేస్తున్న దాపరికం నచ్చలేదని బాబు మోహన్ మండిపడ్డారు. అందుకే పార్టీకి దూరంగా  ఉండాలని నిర్ణయించుకున్నానని అన్నారు. పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు, ప్రచారాలకు కూడా దూరంగా ఉంటానని చెప్పారు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి అవసరమైతే.. పార్టీకి కూడా రాజీనామా చేస్తానని బాబు మోహన్ వ్యాఖ్యానించారు. తన ఆత్మాభిమానం దెబ్బ తినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.

అలాగే ఆందోల్ టికెట్ తనకు కాకుండా.. తన కొడుక్కి ఇస్తారంటూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన కొడుకుని విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని భగ్గుమన్నారు. అసలు తనకు తన కొడుక్కి మధ్యపోటీ ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారాలు చేయడం ఆపేయాలని బాబు మోహన్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + twenty =