కొత్తగూడెం జిల్లాలో టిఆర్ఎస్ నాయకున్ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

Mango News, maoists kidnapped trs leaders, Maoists Kidnaps TRS Leader In Kothagudem District, Telangana Political News, TRS leader abducted by suspected Maoists in Telangana, TRS leader allegedly abducted by suspected Maoists from his home, TRS Leader Kidnapped By Suspected Maoists In Telangana, TRS leader Srinivas Rao abducted by Maoists

తెలంగాణ లోని కొత్తగూడెం జిల్లాలో కొత్తూర్ గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు నల్లూరి శ్రీనివాస్ రావు ని, 15 మంది సభ్యులుగల మావోయిస్టు అనుమానిత బృందం, జూలై 8న అతని ఇంటికి వచ్చి దాడి చేసి,వారి వెంట తీసుకొని వెళ్లారు. జూలై 9 న పోలీసులు మీడియాను ఉద్దేశించి మాట్లాడిన తరువాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నల్లూరి శ్రీనివాస్ భార్య, దేవి ఇచ్చిన ప్రకటన ప్రకారం, ముగ్గురు తమ ఇంట్లోకి ప్రవేశించి గిరిజన- ఆదివాసి భూములు ఆక్రమించుకున్నవంటు, పంట రుణాలను అధిక రేటుకు పెంచావని ఆరోపించి దాడి చేసారని తెలిపారు. అంతేకాకుండా వారు తన వైపు తుపాకీ చూపించి,ఇంటి నుండి బయటపడటకు వెళ్లోద్దని బెదిరించినట్టు చెప్పారు.

తెలంగాణ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిద్ధం చేసి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు, భద్రాచలం అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) రాజేష్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ నల్లూరి శ్రీనివాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది అని, ఛత్తీస్‌గడ్ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కూడా సమన్వయం చేసుకొని ఈ కేసు దర్యాప్తు చేస్తునట్టు తెలిపారు. కొత్తూర్, చర్ల మరియు సమీప గ్రామాలకు చెందిన కొంతమంది గ్రామస్తులు, టిఆర్‌ఎస్ నాయకుడి బంధువులతో కలిసి సుమారు 300 మంది ఛత్తీస్‌గడ్ కి వెళ్లి శ్రీనివాస్‌ను విడుదల చేయాలని మావోయిస్టులు కోరినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తి స్థాయిలో జరుగుతోంది అని, వెంటనే శ్రీనివాస్‌ను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =