తెలంగాణ‌ రాష్ట్రంలో 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ

Telangana Govt Releases Police Recruitment Notification for 16614 Posts, Police Recruitment Notification for 16614 Posts, TRS Govt Releases Police Recruitment Notification for 16614 Posts, Police Job Recruitment Notification, Telangana Police Recruitment 2022, 2022 Telangana Police Recruitment, Telangana Police Recruitment, Telangana Govt is all set to recruit over 16614 police personnel for the state, Telangana Police Recruitment For 16614 Posts, Telangana Police Recruitment News, Telangana Police Recruitment Latest News, Telangana Police Recruitment Latest Updates, Telangana Police Recruitment Live Updates, Telangana Govt, Telangana CM KCR, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 శాఖలకు సంబంధించిన 80,039 పోస్టుల భర్తీ చేయనున్నట్టు ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా రాష్ట్రంలో పోలీసు శాఖకు సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేష‌న్ ను విడుదల చేశారు. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌ నోటిఫికేష‌న్‌ ను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) విడుదల చేసింది. ఇందులో 587 ఎస్ఐ పోస్టులు, 16027 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడే సూచించిన ప్రొఫార్మాలో మే 2వ తేదీ నుండి మే 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. నోటిఫికేషన్‌లలో ఇచ్చిన విధంగా అన్ని అర్హత అవసరాలకు అనుగుణంగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

ఎస్ఐ పోస్టులు (587):

  1. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) సివిల్ ఎస్ఐలు – 414
  2. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) ఏఆర్ ఎస్ఐలు – 66
  3. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐలు – 05
  4. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) టీఎస్ఎస్‌పీ ఎస్ఐలు – 23
  5. తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఎస్ఐలు – 12
  6. తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అండ్ అగ్నిమాపక సేవల డిపార్ట్మెంట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ – 26
  7. జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ డెప్యూటీ జైలర్ – 08
  8. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) ఎస్ఐ (ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్) – 22
  9. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) ఎస్ఐ (పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్) – 3
  10. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) అసిస్టెంట్ ఎస్ఐ (ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరో) – 08

కానిస్టేబుల్ పోస్టులు (16027):

  1. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) సివిల్ కానిస్టేబుల్స్ – 4965
  2. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) ఏఆర్ కానిస్టేబుల్స్ – 4423
  3. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) ఎస్ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్స్ – 100
  4. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) టీఎస్ఎస్‌పీ కానిస్టేబుల్స్ – 5010
  5. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ – 390
  6. తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అండ్ అగ్నిమాపక సేవల డిపార్ట్మెంట్ లో అగ్నిమాపక సిబ్బంది – 610
  7. జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వార్డర్ (పురుషులు) – 136
  8. జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వార్డర్ (మహిళలు) – 10
  9. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) పోలీస్ కానిస్టేబుల్స్ (ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్) – 262
  10. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) పోలీస్ కానిస్టేబుల్స్- మెకానిక్ (పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్) – 21
  11. స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్సీటీ) పోలీస్ కానిస్టేబుల్స్ – డ్రైవర్ (పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్) – 100
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 10 =