మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసారు. సోమవారం ఇన్స్టాగ్రామ్లో రంగస్థలం సినిమాలోని లుక్ తో ఉన్న ఒక ఫోటో ని పోస్ట్ చేసారు. సినిమా నటుల వ్యక్తిగత విషయాలు, చేయబోయే సినిమా ప్రకటనలు, సినిమా ప్రచారాలు, అభిమానులకు చేరవేయడంలో ట్విట్టర్, పేస్ బుక్,ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. రామ్ చరణ్ గతంలో ఒకసారి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి, కొన్ని కారణాలవల్ల డిలీట్ చేసారు. చరణ్ ఇప్పటివరకు తన పేస్ బుక్ పేజీ లో మాత్రమే అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తూ, వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేస్తుంటాడు. ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో తన అభిప్రాయాల్ని, తనకున్న లక్షలాది అభిమానులతో పంచుకోబోతున్నాడు.
రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే, తన స్నేహితుడు, హీరో అఖిల్ ఇదొక సర్ప్రైజ్ అంటూ స్వాగతం చెప్పారు. కాగా రామ్ చరణ్ ఈ రోజు ఒక వీడియో విడుదల చేసి ఈ శుక్రవారం జూలై 12 నుంచి ఇన్స్టాగ్రామ్లో ఉంటానని తెలిపారు. ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్లో తన అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నానని, ఇది కొత్తగా ఉంటుందని మరియు చాలా సరదాగా ఉండబోతుందని చెప్పాడు. అకౌంట్ ఓపెన్ చేసిన రెండు రోజుల్లోనే 2 లక్షల 40 వేల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు అకౌంట్స్ ఓపెన్ చేసారు.