రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు లేవు – ఈటెల రాజేందర్

District Officials On Dengue, Etela Rajender Conducts Review With District Officials, Etela Rajender Conducts Review With District Officials On Dengue, Etela Rajender Conducts Review With District Officials On Dengue Virus, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ రోజు కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలపై జిల్లా కలెక్టర్, ప్రజాపతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జ్వరాలు పెరిగిన మాట వాస్తవమేనని, అయితే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల నిల్వలు ఉన్నాయని, మందులకు ఎటువంటి కొరత లేదని చెప్పారు. రాష్ట్రంలో టైపాయిడ్, మలేరియా లాంటివే ఉన్నాయని, డెంగ్యూ జ్వరాలు లేవని అన్నారు. వాతావరణ మార్పుల వలన వచ్చే సాధారణ జ్వరాలే 99 శాతం ఉన్నాయని మంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతుంటే అధికారాలు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవని ఈటెల మండిపడ్డారు. పారిశుద్ధ్య, ఫాగింగ్ యంత్రాలను వెంటనే సమకూర్చుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

జ్వరం బాధపడుతున్న ప్రజలు ఎక్కువుగా ఉన్న గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించాలని అధికారులను కోరారు. వైద్య సిబ్బంది కొరత ఏర్పడితే, తాత్కాలిక ప్రాతిపదికన ఆసుపత్రుల్లో అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. ఎలీసా పరీక్ష జరిపిన తర్వాత మాత్రమే డెంగ్యూపై నిర్దారణకు రావాలని మంత్రి సూచించారు. డెంగ్యూ, తదితర విష జ్వరాలపై ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టమొచ్చినట్టు ప్రకటనలు చేయకూడదని, కేవలం డిహెచ్ఎంవో ద్వారానే బులెటిన్ విడుదల చేయాలని చెప్పారు. వైద్యులు సెలవులు రద్దు చేసుకొని రోగులకు మెరుగైనా వైద్యం అందించేందుకు కృషి చేయాలనీ కోరారు.

[subscribe]
[youtube_video videoid=dGSvroR_1L8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + sixteen =