ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, ట్రాన్స్‌ఫర్స్ గైడ్‌లైన్స్, షెడ్యూల్ విడుదల

AP Govt Gives Green Signal To The Transfers of Teachers Issued Guidelines For Schedule and Counselling Dates,AP Govt Gives Green Signal,Green Signal To The Transfers of Teachers,Transfers of Teachers Issued,AP Govt Gives Green Signal For Teachers,AP Govt Issued Guidelines For Schedule,AP Govt Counselling Dates,Mango News,Mango News Telugu,Green signal for transfer of teachers in AP,AP Teachers Transfers 2023 Guidelines,AP Teachers Transfers 2023,AP Govt Teachers,AP Teachers Transfers Rules,AP Teachers Transfers Guidelines,AP Teachers Latest News,AP Teachers Latest Updates,AP Teachers Live News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి వేర్వేరు మార్గదర్శకాలను విడుదల చేసింది. 8 సంవత్సరాలు ఒకే చోట పనిచేసిన ఉపాధ్యాయులకు బదిలీలు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ప్రిన్సిపాల్ బదిలీ కూడా తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. కొత్త జిల్లాలను యూనిట్‌గా తీసుకుని ఉపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్ల బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే, జూన్ 1 నుండి మళ్లీ నిషేధం వర్తిస్తుంది. రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో బదిలీలకు అవకాశం కల్పిస్తూ.. ఈ మేరకు ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీఓ నెం.47ను విడుదల చేసింది. ఇక 2023 ఏప్రిల్ 30 నాటికి ఒకే చోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు అభ్యర్ధన మేరకు బదిలీలకు అవకాశం ఉంటుంది. ఉద్యోగుల అభ్యర్థన, పరిపాలన ప్రాతిపదికన బదిలీలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఈ బదిలీల్లో భార్యాభర్తలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అయితే ఒకసారి ఈ అవకాశం వినియోగించుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాతే బదిలీలకు అర్హులు అవుతారని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఐదు రోజుల క్రితం ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీలపై చర్చించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nineteen =