కొండపోచమ్మ కెనాల్ నుండి కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు

Godavari Water into Kudavelli Vagu from Kondapochamma Sagar Canal, Harish Rao Released Godavari Water into Kudavelli Vagu, KLIS water is released in Kudavelly Vagu, KLIS water released into Kudavelly Vagu, KLIS water to be released into Kudavelly Vagu, Kondapochamma Sagar, Kondapochamma Sagar Canal, Kudavelli Vagu, Mango News, Minister Harish Rao, Minister Harish Rao Released Godavari Water into Kudavelli Vagu, Water released to irrigate

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ ‌రావు మంగళవారం నాడు కొండపోచమ్మ కెనాల్ నుండి కొడకండ్ల రీమ్మన గూడ వద్ద కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదలతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయని చెప్పారు. గోదారి జలాల విడుదలతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో మొత్తం 11 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. అలాగే కూడవెల్లి వాగుపై గజ్వేల్‌, తొగుట, దుబ్బాక మండలాల్లో 36 చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకుంటాయని పేర్కొన్నారు.

ముందుగా రైతుల అవసరం దృష్టిలో పెట్టుకొని కోడకండ్ల వద్ద కెనాల్ నుండి కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయడంపై మార్చి 21న సీఎం కేసీఆర్ తో క్షేత్రస్థాయి నుంచే మంత్రి హరీశ్ రావు ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో తక్షణమే నీటిని వదిలి రైతుల అవసరాలు తీర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాల విడుదల పట్ల గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ రైతుల హర్షం వ్యక్తం చేశారు. అలాగే రైతుల పక్షాన సీఎం కేసీఆర్ కు మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − three =