శానిటేషన్ ఛాలెంజ్ : తెలంగాణ రాష్ట్రానికి 12 అవార్డులు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Awards in Sanitation Challenge, KTR Expressed Happiness on Telangana State Winning 12 Awards in Sanitation Challenge, Mango News, Minister KTR, Minister KTR Expressed Happiness on Telangana State, Minister KTR Expressed Happiness on Telangana State Winning 12 Awards in Sanitation Challenge, Telangana Awards in Sanitation Challenge, Telangana State Winning 12 Awards in Sanitation Challenge, Telangana State won 12 Awards in Sanitation Challenge

కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ “శానిటేషన్ ఛాలెంజ్” పేరిట జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలో వివిధ కేటగిరీల్లో తెలంగాణ రాష్ట్రానికి 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, మున్సిప‌ల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ సహా సఫాయి మిత్ర సురక్ష, గార్బేజ్‌ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణకు 12 అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా మాస‌బ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ ఆఫీసులో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గ‌త ఏడున్న‌ర సంవ‌త్స‌రాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధిస్తోంది. వివిధ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్నామని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప‌ట్ట‌ణాలు అభివృద్ధి చెందాల‌నే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప‌ట్ట‌ణాభివృద్ధిలో స‌మూల‌మైన మార్పులు తీసుకువ‌చ్చారు. ఆద‌ర్శ‌వంత‌మైన ప‌ట్ట‌ణాల‌ను రూపొందించేందుకు సీఎం కేసీఆర్ కొత్త‌ మున్సిప‌ల్ చ‌ట్టాన్ని తీసుకొచ్చారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం కూడా అమ‌లు చేశారు. మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 142కు పెంచామని చెప్పారు. అలాగే మున్సిపాలిటీల‌కు నిధుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేస్తున్నామని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ పుర‌పాల‌క సంఘాల‌కు రూ. 2,950 కోట్లు విడుద‌ల చేశామని తెలిపారు.

దేశవ్యాప్తంగా శానిటేష‌న్ ఛాలెంజ్‌లో భాగంగా 4300 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు పోటీ ప‌డితే తెలంగాణ‌కు 12 అవార్డులు వ‌చ్చాయి. ఈ అవార్డులు రావడాన్ని ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి ల‌భించిన గుర్తింపుగా భావిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. నవంబర్ 20న ఢిల్లీలోని విజ్ఞాన భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోబోతున్నామని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి, అధికారుల‌కు గ‌ర్వ‌కార‌ణం. మున్సిప‌ల్ అధికారుల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో ఇప్ప‌టికే 101 మున్సిపాలిటీల‌ను ఓడిఎఫ్ ప్ల‌స్ కేటగిరీలుగా కేంద్రం గుర్తించిందన్నారు. 8 మున్సిపాలిటీల‌కు ఓడిఎఫ్ ప్ల‌స్ ప్ల‌స్ గుర్తింపు వ‌చ్చిందని, స్ట్రీట్ వెండ‌ర్స్‌కు రుణాలను ఇవ్వ‌డంలో కూడా తెలంగాణ నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచిందని చెప్పారు. ప్ర‌తీ విష‌యంలో తెలంగాణ అగ్ర‌గామిగా నిలుస్తుందంటే కేవ‌లం ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలేనని, తెలంగాణ రాష్ట్రంలో రూర‌ల్, అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అద్భుతంగా జ‌రుగుతోందని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fourteen =