ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం, తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ కైవసం

Australia Beat New Zealand, Australia Beat New Zealand By 8 Wickets, Australia Beat New Zealand By 8 Wickets In Final Win Maiden T20 WC Title, Australia lift maiden T20 World Cup, Final Win Maiden T20 WC Title, Highlights Australia vs New Zealand T20 World Cup 2021, Mango News, New Zealand vs Australia Highlights, NZ vs AUS Final, NZ vs AUS Match Highlights, NZ vs AUS T20 Scorecard, T20 World Cup 2021 Final, T20 World Cup Final, T20 World Cup-2021

టీ20 ప్రపంచ కప్-2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు, తొలిసారిగా టీ20 ప్రపంచకప్ ను కూడా తన ఖాతాలో వేసుకుంది. టోర్నీకి ముందు పలు సమస్యలతో బరిలోకి దిగి, అద్భుత ప్రదర్శనతో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియా కప్ గెలుచుకుని, క్రికెట్ లో తమ ఘనతను మరోసారి చాటిచెప్పింది. మరోవైపు టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ జట్టు ఫైనల్ లో పరాజయంతో నిరాశలో కూరుకుపోయింది. ఇప్పటికే 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనళ్లలో ఓటమి న్యూజిలాండ్ ను వెంటాడుతుండగా, తాజాగా మరో ఐసీసీ ఫైనల్లో కూడా ఓడిపోవడంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు తీవ్ర వేదనకు గురయ్యారు.

ముందుగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (48 బంతుల్లో 85 పరుగులు, 10×4, 3×6)తో విధ్వంసం సృష్టించగా, గుప్తిల్ 28, ఫిలిప్స్ 18 పరుగులుతో రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లులో హాజెల్ వుడ్ 3, ఆడమ్ జాంపా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు, మొదటి నుంచే ఆధిపత్యాన్ని చెలాయించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (38 బంతుల్లో 53, 4×4, 3×6) మరోసారి విధ్వంసం సృష్టించాడు. అలాగే వార్నర్ కు తోడు మిచెల్‌ మార్ష్‌ (50 బంతుల్లో 77 నాటౌట్‌, 6×4, 4×6), మాక్స్ వెల్ (28 నాటౌట్) చెలరేగడంతో ఆస్ట్రేలియా జట్టు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సునాయాసంగా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ పై అద్భుత విజయాన్ని నమోదు చేసి, టీ20 ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ బౌలర్లు కనీస ప్రభావం చూపలేకపోవడంతో ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ట్రెంట్ బౌల్ట్ మాత్రమే రెండు వికెట్స్ పడగొట్టాడు. ఇక ఫైనల్లో సత్తాచాటిన మిచెల్ మార్ష్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించగా, టోర్నీలో 7 ఇన్నింగ్స్ లో 289 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ అవార్డును దక్కించుకున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + twenty =