ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా మూతపడలేదు – విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

AP Education Minister Botsa Satyanarayana Gives Clarity on Allegations of Closing Govt Schools, Education Minister Botsa Satyanarayana Gives Clarity on Allegations of Closing Govt Schools, Minister Botsa Satyanarayana Gives Clarity on Allegations of Closing Govt Schools, Botsa Satyanarayana Gives Clarity on Allegations of Closing Govt Schools, Clarity on Allegations of Closing Govt Schools, Allegations of Closing Govt Schools, Closing Govt Schools Allegations, Closing Govt Schools, AP Education Minister Botsa Satyanarayana, Education Minister Botsa Satyanarayana, Minister Botsa Satyanarayana, AP Education Minister, Botsa Satyanarayana, Allegations of Closing Govt Schools News, Allegations of Closing Govt Schools Latest News, Allegations of Closing Govt Schools Latest Updates, Allegations of Closing Govt Schools Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా మూతపడలేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను పెద్ద సంఖ్యలో మూసివేస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. దీనిపై మంత్రి బొత్స ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, ప్రభుత్వం అలాంటి చర్యలకు పాల్పడదని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలవల్ల వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని, అయితే వీరి తప్పుడు మాటల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసర ఆందోళనకు లోనవుతారని అందుకే ఈ ఆరోపణలపై స్పందించాల్సి వస్తోందని బొత్స సత్యనారాయణ తెలిపారు.

తొలుత ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, మళ్ళీ అవే మాటలను పట్టుకుని తర్వాతి రోజు ప్రతిపక్ష నాయకులు నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క ప్రభుత్వ పాఠశాలనైనా మూతపడినట్లుగా చూపించగలరా? అని మంత్రి సవాల్ చేశారు. దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా విద్యారంగంలో సంస్కరణలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని, సీఎం జగన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంస్థ ‘బైజూస్’తో కీలక ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తుచేశారు. తద్వారా పేద పిల్లలకు నాణ్యమైన డిజిటల్ విద్యను అందించగలమని తెలిపారు. అంతేకాకుండా ఖరీదైన ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 1 =