నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన, ఫతేనగర్ ఎస్టీపీ నిర్మాణం, నియోపోలీస్‌ లేఅవుట్ అభివృద్ధి పనుల పరిశీలన

Minister KTR Inspects Sewage Treatment Plant Works at Fatehnagar Developmental Works at Neopolis Layout, Minister KTR Checks Fatehnagar Sewage Plant, KTR Inspects Sewage Treatment Plant, Sewage Treatment Plant Works at Fatehnagar, Fatehnagar Developmental Works at Neopolis, Neopolis Layout, Mango News, Mango News Telugu, Minister KTR Vistis Sewage Treatment Plant Works, KTR Visits Fatehnagar Developmental Works, Minister KTR Inspects Sewage Treatment, Minister KTR, Telangana Minister KTR, Minister KTR Latest News And Updates

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఫతేనగర్‌లో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని (ఎస్టీపీ) మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై ఆరా తీశారు. అనంతరం ఫతేనగర్ ఎస్టీపీ వద్ద నిర్మాణ కార్మికులతో మంత్రి కేటీఆర్ స్నేహపూర్వకంగా మాట్లాడి వారి ఆరోగ్యం, క్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణ పురోగతిని పర్యవేక్షించాను. 1259 ఎంఎల్డీ సామర్థ్యంతో శుద్ధి చేసే ఎస్టీపీలు 2023 వేసవి నాటికి పూర్తవుతాయి, హైదరాబాద్ బహుశా దాని 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసిన మొదటి నగరంగా మారుతుంది” అని తెలిపారు.

అనంతరం హైదరాబాద్‌లోని కోకాపేటలోని నియోపోలీస్‌ లేఅవుట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఫ్యూచరిస్టిక్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా సౌకర్యాలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్లోబల్ బెంచ్‌మార్క్‌కు సరిపోయే విధంగా రోడ్ నెట్‌వర్క్‌లు, వినోద సౌకర్యాలు మరియు సైకిల్ ట్రాక్ కోసం ప్రణాళికలలో కొన్ని మార్పులను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సూచించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − five =