హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేక వీడియో విడుదల చేసిన మంత్రి కేటిఆర్

GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, GHMC Nominations, Greater Hyderabad Municipal Corporation, Hyderabad City Development, Hyderabad City Development in Last 6 Years, KTR Released a Special Video over Hyderabad City Development, Mango News, Special Video over Hyderabad City Development, Special Video over Hyderabad City Development in Last 6 Years

టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటిఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రతి రోజు పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ తన ప్రసంగాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గత ఆరేళ్లుగా హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ, హైదరాబాద్ మరింత గొప్పగా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీనే భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఇక మరోవైపు సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ ద్వారా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో ప్రత్యేక వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటిఆర్ మంగళవారం నాడు కూడా ఓ ప్రత్యేక వీడియో పోస్టు చేసి “ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ ఆశీర్వాదంతో ఆరేళ్లలో మన నగరంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాం. హైదరాబాద్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు డిసెంబర్ 1 నాడు కారు గుర్తుకు ఓటేద్దాం” అని పేర్కొన్నారు.

ఆరేళ్ల హైదరాబాద్ నగర అభివృద్ధి మీ కళ్ల ముందే ఉందంటూ ఈ వీడియోలో అనేక అంశాలను పొందుపరిచారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా, ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు, ఆధునిక సదుపాయాలతో ప్రజా రవాణా వ్యవస్థ, ట్రాఫిక్ తగ్గించడానికి సరికొత్త రహదారుల నిర్మాణం, నిరుపేదలకు ఆత్మగౌరవ గృహాలు, బస్తీ దవాఖానాలతో నగరవాసులకు మెరుగైన వైద్యం, ప్రపంచస్థాయి పోలీసింగ్ తో ప్రజలకు భరోసా, మహిళా భద్రతా కోసం రాజీలేని కృషి, ఐదు రూపాయలకే ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లు, మెరుగైన జీవన విధానం కోసం వ్యర్ధాల వ్యవస్థ నిర్వహణ, భవిష్యత్ తరాల కోసం పట్టణాల్లో అడవుల పెంపకం, పాదచారులు, ప్రయాణికుల సౌకర్యానికి ఫుట్ పాత్ లు, బస్సు స్టాఫుల నిర్మాణం, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ వంటి అభివృద్ధి వివరాలను ఈ వీడియోలో పొందుపరిచారు. హైదరాబాద్ ప్రభవిస్తున్నవిశ్వనగరమని, టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి అభివృద్ధిని కాపాడుకోవాలని మంత్రి కేటిఆర్ ప్రజలకు సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =