గ్రేటర్ ఎన్నికలు: టిఆర్ఎస్ మేనిఫెస్టోలో పలు వరాలు ప్రకటించిన సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Released TRS Manifesto, CM KCR Released TRS Manifesto For GHMC Elections, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, GHMC Nominations, Greater Hyderabad Municipal Corporation, KCR Release Manifesto For GHMC Elections 2020, Mango News, TRS Manifesto For GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు ప్రచారం పెద్దఎత్తున కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, భారతదేశంలోనే ఒక నిజమైన కాస్మోపాలిటన్ నగరంగా, గొప్ప చారిత్రక నగరంగా హైదరాబాద్‌ ప్రసిద్ధి చెందిందని అన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి ఎవరొచ్చినా ఉపాధి, ఉద్యోగం కల్పించి అక్కున చేర్చుకునే గొప్ప నగరంగా హైదరాబాద్ రూపుచెందిందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను అర్థం చేసుకుని పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను సీఎం కోరారు.

టిఆర్ఎస్ మేనిఫెస్టో వివరాలు:

  • డిసెంబరు నుంచి 20వేల లీటర్ల వరకు వాడుకునే ప్రజలు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో 97 శాతం ప్రజలకు లబ్ది.
  • కరోనా సమయానికి సంబంధించి రూ. 267 కోట్ల విలువైన మోటార్ వాహన పన్ను రద్దు.
  • మార్చి-సెప్టెంబర్ కరోనా కాలానికి పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, థియేటర్లుకు సంబంధించి  హెఛ్టీ, ఎల్టీ కేటగిరీల కరెంట్ మినిమం డిమాండ్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • థియేటర్లుకు మాత్రం ప్రారంభమయ్యేంత వరకు కరెంట్ మినిమం డిమాండ్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు.
  • పదికోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించే సినిమాలకు స్టేట్ జీఎస్టీ 9% రియంబర్స్ మెంట్ కు నిర్ణయం.
  • సినిమా థియేటర్స్/ మల్టిఫ్లెక్సులలో మల్టీ షోలు వేసేందుకు అనుమతి. అలాగే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక తరహాలో టికెట్ రేట్ల సవరణకు వెసులుబాటు.
  • రాష్ట్రవ్యాప్తంగా బార్బర్ షాపులకు, సెలున్లకు డిసెంబర్‌ నెల నుంచి ఉచిత విద్యుత్‌ సరఫరా.
  • రాష్ట్రవ్యాప్తంగా లాండ్రిలకు, ధోబీఘాట్ లకు ఉచిత విద్యుత్.
  • రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం. 
  • నగరంలో మరో మూడు టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు.
  • బస్తీ దవాఖానాల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటు.
  • వరద బాధ నుంచి హైదరాబాద్ కు శాశ్వత విముక్తి లభించేలా చర్యలు.
  • మూసి నదిని గోదావరితో అనుసంధానం, మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు.
  • వీలైనంత త్వరగా మెట్రో సెకండ్ ఫేజ్ పూర్తీ.
  • మెట్రోను ఎయిర్ పోర్ట్ వరకు లింక్ చేస్తాం.
  • హైదరాబాద్ త్రాగునీటి అవసరాల కోసం త్వరలోనే కేశవాపురం జలాశయనిర్మాణ పనులు ప్రారంభం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 14 =